గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు బీడీ వెనుక బిగ్ సీక్రెట్!!

గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తన యాక్షన్ తో అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చేసిన డాన్స్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ లా మారింది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో గతానికి భిన్నంగా స్టైల్ గా బీడీ కాల్చే మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మహేష్ బాబు స్మోకింగ్ చేయడం వంటి వాటికి దూరంగా ఉంటాడు.

మహేష్ బాబు సినిమాల్లో కూడా ఎక్కడ స్మోక్ చేసినట్టు కనిపించదు. అయితే మహేష్ బాబు బీడీని తాగుతూ గుప్పు గుప్పు మంటూ పొగల వదలడం చర్చనీయాంశమైంది. నిజంగానే మహేష్ బాబు బీడీ తాగాడా? మహేష్ బాబుకి ఇలాంటివి ఇష్టం ఉండదు కదా.. అంటూ చర్చ జరిగింది. కొంతమంది మహేష్ బాబు బీడీ తాగుతూ జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? బీడీ తాగమని ప్రమోట్ చేస్తున్నారా? అంటూ విమర్శించిన వారు కూడా లేకపోలేదు.

Big secret behind Mahesh Babu beedi smoking in Guntur Karam movie!!

అయితే మహేష్ బాబు సినిమాలో తాగిన బీడీ వెనుక అసలు కథను చెప్పేశారు. చెడు అలవాట్లను ప్రోత్సహించే నైజం లేని మహేష్ బాబు తాను తాగిన బీడీ పొగాకుతో కూడిన బీడీ కాదని, అది ఆయుర్వేదిక్ బీడీ అని అసలు నిజాన్ని ప్రేక్షకులకు చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబుకి రియల్ బీడీ ఇచ్చారట. అయితే అది ఒకసారి తాగడంవల్ల విపరీతమైన మైగ్రేన్ తలనొప్పి వచ్చి ఇబ్బంది పడ్డారట.

దీంతో తన వల్ల కావడం లేదని త్రివిక్రమ్ కి మహేష్ బాబు చెప్పారట. ఇక మహేష్ బాబు కోసం ఆల్టర్నేట్ బీడీని అరేంజ్ చేసిన త్రివిక్రమ్ లవంగాలతో తయారు చేసిన ఆయుర్వేదిక్ బీడీని మహేష్ కోసం తెచ్చి ఇచ్చారట . ఇక ఆ బీడీ కూడా బాగానే ఉందని, దాని వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉండటంతోనే మహేష్ బాబు సినిమాలో గుప్పు గుప్పుమంటూ బీడీ తాగాడట.

Big secret behind Mahesh Babu beedi smoking in Guntur Karam movie!!

ఇక ఇదే విషయాన్ని మహేష్ బాబు ప్రేక్షకులతో పంచుకున్నారు. తాను తాగింది రియల్ బీడీ కాదని క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా మహేష్ బాబు తాను నటించిన సినిమాలు సమాజాన్ని చెడగొట్టేవిగా ఉండకూడదని, కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. అదే క్రమంలో ఆయన అందుకు కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అన్నది ఈ సినిమాతో కూడా మరోమారు స్పష్టం అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+