Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్‌లోకి వైరల్ జోడీ: సోషల్ మీడియా ట్రెండింగ్ పెయిర్‌పై చర్చ!
Bigg Boss 10 Telugu:: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటికే వరుసగా అప్డేట్లు ఇస్తూ ఆసక్తిని పెంచేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో కామనర్లను హౌస్ లోకి తీసుకొచ్చే ప్రక్రియ దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ సారి కూడా మన్మథుడు అక్కినేని అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. పదో సీజన్ కావడంతో ఈ సారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు తీసుకురానున్నారు. కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే గేమ్స్, టాస్కుల విషయంలోనూ చాలా కొత్త విషయాలు ఉంటాయని తెలుస్తోంది. కాగా ఈసారి షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లపై ఊహాగానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
అయితే 'బిగ్‌బాస్' పదో సీజన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారమవుతున్నాయి.ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం ఫేమ్ ఉన్నవాళలను, యాక్టింగ్ నైపుణ్యాలు ఉన్న వారిని తీసుకొచ్చేవారు. అప్పుడు చూసేందుకు కూడా చాలా బాగా అనిపించేంది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కాంట్రవర్సీ ఉన్నవాళ్లనే తీసుకొస్తున్నారు అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో విపరీతం ట్రెండ్ అయ్యే ఇన్‌ఫ్లుయెన్సర్లు, కాంట్రవర్సీ వ్యక్తులు లేదా నెట్టింట వైరల్ అయ్యే జోడీలను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురావడం నిర్వాహకులకు పరిపాటే. ఈ క్రమంలోనే ప్రస్తుతం లభిస్తున్న క్రేజ్, ట్రెండింగ్ ఆధారంగా బిగ్ బాస్ టీమ్ ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ లను సంప్రదించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

నెట్టింట వైరల్ కాంబినేషన్
ప్రస్తుతం సోషల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ పేర్లు విపరీతంగా మార్మోగిపోతున్నాయి. వీరు కలిసి డ్యాన్స్ చేసిన "రాతిరి రాతిరి" వంటి జానపద పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభించింది. అయితే ఇటీవల వీరిద్దరి చుట్టూ ముసురుకున్న వివాదాలు, కుటుంబ సమస్యల వార్తలు సోషల్ మీడియాలో మరింత కలకలం రేపాయి. ఈ సంచలనాల వల్ల బుల్లితెర వీక్షకులలో కూడా వీరిపై ఆసక్తి రెట్టింపైంది.
వీరిద్దరూ హౌస్ లోకి అడుగుపెడతారా?
అయితే ఈశ్వర్ సాయిని పక్కన పెడితే.. మాధురీ రాథోడ్ కు బిగ్ బాస్ నుంచి కబురు వచ్చిందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ.. షోలోకి వెళ్లాలా వద్దా అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే వివాదాలు, క్రేజ్ తో ట్రెండింగ్లో ఉన్న ఈ వైరల్ జోడీ నిజంగానే బిగ్ బాస్ రియాలిటీ షో వేదికపైకి అడుగుపెడితే.. హౌస్ లో ఉండే డ్రామా, రచ్చ, ఎంటర్‌టైన్‌మెంట్ వేరే స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.














Click it and Unblock the Notifications