బిగ్ బాసా ? క్రికెట్ వరల్డ్ కప్పా ? ప్రేక్షకుల్లో కొత్త డైలమా !
భారత్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. అదే సమయంలో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు బిగ్ ఈవెంట్లలో ఏది చూడాలనే దానిపై ప్రేక్షకుల్లో గందరగోళం పెరుగుతోంది. ఈ రెండు ఈవెంట్లూ వేటివకే ప్రత్యేకమైనవి. ఒకటి పూర్తి వినోదాత్మక రియాల్టీ షో కాగా..మరొకటి యూత్ లో మజాను పెంచే మెగా క్రికెట్ ఈవెంట్. ఈ రెండు ఈవెంట్లూ ఒకేసారి, ప్రతీ రోజూ ఒకే సమయంలో కొనసాగుతుండటంతో ప్రేక్షకుల్లో ఏది చూడాలనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈ ఏడాది అక్టోబర్ 5న వన్డే ప్రపంచ కప్ ప్రారంభమైంది. అదే సమయంలో కమల్ హాసన్ 'బిగ్ బాస్ తమిళ్ 7',అక్టోబర్ 1న, సుదీప్ 'బిగ్ బాస్ కన్నడ 10' అక్టోబర్ 8న ప్రారంభమయ్యాయి. అంటే వారం రోజుల వ్యవధిలో ఈ మూడు ఈవెంట్లు మొదలయ్యాయి. ఇదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు కూడా గత నెల నుంచి కొనసాగుతోంది. ఈ వారం సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్ 17' హిందీ ప్రారంభం కానుంది.

అదే సమయంలో బిగ్ బాస్ షోలతో పాటు క్రికెట్ వరల్డ్ కప్ కూడా టీవీల్లో దాదాపు ఒకే సమయానికి ప్రసారం అవుతున్నాయి. వీటిలో ఏ ఒక్క దాన్నీ సమయం మార్చే ఛాన్స్ లేదు. క్రికెట్ వరల్డ్ కప్ అంతర్జాతీయ ఈవెంట్ కావడంతో అన్ని దేశాలకూ మ్యాచ్ అయ్యేలా డేనైట్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. వీటిని మార్చేందుకు వీలు కాదు. అలాగని బిగ్ బాస్ రియాల్టీ సమయాన్ని మార్చేందుకూ వీలు లేదు. ఎందుకంటే ఈ షోల్లో ఉంటున్న కంటెంట్ ను రాత్రి సమయాల్లో మాత్రమే ప్రసారం చేయాలనే నిబంధనలు ఉన్నాయి.
దీంతో ప్రేక్షకులు ఒకే సమయంలో ఈ రెండు ఆసక్తికర ఈవెంట్స్ ను తిలకించేందుకు వీల్లేకుండా పోతోంది. ఒకే సమయంలో బిగ్ బాస్ నూ, క్రికెట్ ను చూడలేరు కాబట్టి రెండింటిలో ఎక్కువ ఆసక్తికరంగా ఉన్న ఈవెంట్ ను చూసేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా భారత్ ఆడే మ్యాచ్ లు ఉన్న రోజు బిగ్ బాస్ వీక్షకుల సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. అలాగే ఇతర దేశాల మ్యాచ్ లు ఉన్నప్పుడు బిగ్ బాస్ షోలకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది.












Click it and Unblock the Notifications