బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ ఇదే..!
సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోంది బిగ్‌బాస్ షో . కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది. షో మొదట్లో సెలబ్రిటీలను మాత్రమే తీసుకురాగా తర్వాత సామాన్యులను, పెళ్లైనా జంటలను కూడా షోకు తీసుకురావడం మొదలుపెట్టారు. తెలుగులో ద్విగజయంగా ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్, మరో సీజన్‌కు రెడీ అవుతోంది.
జన్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న భారీ సెట్ కూడా పూర్తి కావొచ్చింది. ఈ సీజన్‌లో హోస్ట్‌ను మారుస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ , 8వ సీజన్‌లో కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గత మూడు 'బిగ్ బాస్' సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఫెయిల్ అయ్యాయి. హౌస్‌లోకి వచ్చిన ఆర్టిస్టులు పెద్దగా ఫేమస్ కాకపోవడం..'బిగ్ బాస్' ఆడించే గేమ్స్ ఆసక్తికరంగా లేకపోవడం ఇలా అన్ని కలిసి.. 'బిగ్ బాస్' షో ప్లాప్ అయ్యేలా చేశాయి. దీంతో టీఆర్పీ రేటింగ్స్ సైతం భారీగా పడిపోవడంతో.. షో యాజమాన్యం .. 8వ సీజన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది.

దీనిలో భాగంగానే పలువురు సెలబ్రిటీలను షోకు తీసుకువచ్చేలా షో యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకూ విడుదలైన ప్రోమోలు షోపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి.'బిగ్ బాస్' ఏడో సీజన్‌లో కంటెస్ట్‌ల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తలు వహించినట్టు సమాచారం. ఫేమస్ యాకర్ట్స్‌తో పాటు, కపుల్స్‌ను కూడా ఈసారి ఎంపిక చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సారి జరగబోయే సీజన్‌లో టీవీ ఆర్టిస్టులతో పాటు, సినిమా వారిని కూడా అధిక సంఖ్యలో తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది.
ఈసారి బిగ్‌బాస్‌కు వచ్చే కంటెస్టెంట్ల లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే..ఖయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిలిక్కల్, డ్యాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిణి సుందరరాజన్, రీతూ చౌదరి,విష్ణుప్రియ భీమినేని,శేఖర్ బాషా,మోడల్ రవితేజ, దర్శకుడు పరమేశ్వర్ ,అంజలి పవన్ ,సౌమ్యరావు,అభినవ్ నవీన్,అభిరామ్ వర్మ హీరోయిన్ విస్మయ శ్రీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్లు ఈసారిలో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications