ఓటీటీలో దుమ్మలేపుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా.. పోస్టులతో సోషల్ మీడియా షేక్..
సాధారణంగా సినిమా లవర్స్ కు ఏదైనా మూవీ నచ్చితే దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూస్తారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రచ్చ రచ్చ చేస్తారు. అలా ఇటీవలికాలంలో మలయాళంలో రిలీజ్ అయి అక్కడ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' ఇటీవల థియేటర్లలో విడుదలై అక్కడ సంచలనం సృష్టించింది ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఇక్కడ కూడా సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ మలయాళం సినిమా తెలుగులోనూ అందుబాటులోకి రావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తెలుగు డబ్బింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఈ క్రమంలో సినిమాను తెలుగు ఆడియన్స్ బీభత్సంగా ఓన్ చేసుకున్నారు. మలయాళం రోమ్- కామ్ సినిమాల మ్యాజిక్ అలా ఉంటుంది మరీ.
ఇక ఈ మూవీలో మలయాళం టాప్ యాక్టర్ నివిన్ పౌలీ, 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు జంటగా నటించారు. ఇక ఈ చిత్రానికి గిరీష్ ఏ. డీ దర్శకత్వం వహించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఓటీటీలోకి ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ. 325 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్రను సృష్టించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాను ఆస్వాదించే అవకాశం ఉంది.

మూవీ స్టోరీ విషయానికి వస్తే.. మూవీలో నివిన్ పౌలీ 'జస్టిన్' అనే క్యాటరింగ్ బిజినెస్ చేసే వ్యక్తి పాత్రలో నటించారు. అలాగే మమితా బైజు 'యాష్లే' అనే కాలేజీ స్టూడెంట్ గా కనిపించింది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 12-13 సంవత్సరాలు ఉంటుంది. అయినప్పటికీ జస్టిన్ మంచి మనసుకు ఆకర్షితులైన యాష్లే అతనితో లవ్ లో పడుతుంది. వినూత్నమైన కాన్సెప్ట్ తో ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ.. వారి కుటుంబాల మధ్య జరిగే డ్రామా.. సంభాషణలు.. సహజమైన కామెడీ ప్రేక్షకులకు హాయిగా నవ్వుకునే అనుభూతిని కలిగిస్తాయి. ఇక ప్రస్తుతం బెత్లె హెమ్ కుటుంబ యూనిట్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడే చూసేయండి.












Click it and Unblock the Notifications
