టీమిండియా ఆటగాడి కాపురంలో చిచ్చు పెట్టిన స్టార్ హీరోయిన్..?
టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు తీసుకొంటున్నారనే ప్రచారం గత కొద్దికాలంగా జరుగుతోంది. ఆర్తి అహ్లావత్ అనే అమ్మాయిని సెహ్వాగ్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి వైవాహిక జీవితం 20 ఏళ్ల పాటు సజావుగానే సాగింది.అయితే కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది.
దీని కారణంగానే ఏడాది నుంచి వీరు విడివిడిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. గతేడాది జరిగిన దీపావళి వేడుకల్లో సైతం సెహ్వాగ్ తన ఒక్కడి ఫొటోను మాత్రమే షేర్ చేశారు. తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకర్ని అన్ ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది.

దీంతో తన భార్య ఆర్తి అహ్లావత్‌తో సెహ్వాగ్ 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ఆయన ముగింపు పలుకుతున్నట్టు సమాచారం.ఇదిలా ఉంటే ఓ బాలీవుడ్ నటి వల్లే వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటితో సెహ్వాగ్ క్లోజ్‌తో మూవ్ కావడంతోనే భార్య ఆర్తీ, అతనికి దూరంగా ఉంటుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఆ నటి ఎవరనేది మాత్రం తెలియడం లేదు. అయితే ఒక ఇంటర్య్వూలో తనకు బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టమని సెహ్వాగ్ చెప్పడం జరిగింది. దీంతో ఆమెతో సెహ్వాగ్ ప్రేమలో పడి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే సెహ్వాగ్ మాధురి దీక్షిత్‌ను అభిమానిస్తారని, అంతే కానీ వారి మధ్య ఎలాంటి బంధం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియడం లేదు. మరోవైపు విడాకుల అంశంపై సెహ్వాగ్ కానీ, ఆర్తి కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.












Click it and Unblock the Notifications