తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకుణే..
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తల్లిదండ్రులయ్యారు. దీపికా పదుకుణే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నటి దీపికా పదుకొణె నేటి (ఆదివారం) ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ శుభవార్తతో ఆమె కుటుంబంలో సంతోషం నెలకొంది. ఇక బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తల్లిదండ్రులు అవ్వడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా వారికి సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
దీపికా - రణ్‌వీర్‌లు మొదటిసారిగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'రామ్ లీలా' చిత్రంలో కలిసి నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ చాలా సినిమాల్లోనే నటించారు. అందులో ముఖ్యంగా రామ్ లీలా తర్వాత, బాజీరావు మస్తానీ, పద్మావత్, వంటి సినిమాలు మంచి హిట్‌ను అందుకున్నాయి. అనంతరం ఇరు కుటుంబాల సహకారంతో 2018లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ప్రస్తుతం నటుడు రణవీర్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ'తో గత సంవత్సరం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన 'సింగమ్ అగైన్' షూటింగ్ పనుల్లో బిజిగా ఉన్నారు. దీపికా పదుకుణే మాత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన 'కల్కి 2898 ఏడీ'చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది దీపికా.. ప్రస్తుతం వీరి కుటుంబమంతా ఈ ఆనందంలో మునిగి తేలుతున్నారు.












Click it and Unblock the Notifications