బాబాయ్‌కి ఒక ఇండస్ట్రీ హిట్, ఒక అట్టర్ ఫ్లాప్.. మరి కొడుకుకి ఏమిస్తాడో ?

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో "బోమన్ ఇరానీ" ఒకరు. హిందీ చిత్రసీమలో కూడా 3 Idiots, Munna Bhai M.B.B.S., PK వంటి చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా "వైరస్" పాత్ర ఆయన కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే పాత్రగా నిలిచింది. బాలీవుడ్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన ఆయన.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమయ్యారు. తెలుగులో బోమన్ ఇరానీకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన తొలి చిత్రం "అత్తారింటికి దారేది".

పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆయన రఘునందన్ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా ఆయన చెప్పిన డైలాగులు, నటనలో కనిపించిన సీరియస్‌నెస్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత Bengal Tiger సినిమాలో రవితేజతో కలిసి నటించారు. అలానే పవన్ తో కలిసి మరోసారి "అజ్ఞాతవాసి" చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమాలో సైనికాధికారి పాత్రలో కనిపించారు. ఇక రీసెంట్ గానే ప్రభాస్ నటించిన The RajaSaab చిత్రంలో ఆయన ముఖ్యమైన పాత్రలో కనిపించారు.

boman-irani-gave-hit-and-flop-to-pawan-kalyan-then-this-time-ram-charan-peddi-get-which-by-audience

అయితే ప్రస్తుతం ఈ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన "పెద్ది" చిత్రంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు.

కాగా సినీ పరిశ్రమలో సాధారణంగానే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. టైటిల్ విషయంలో, నటీనటుల విషయంలో కూడా కొన్ని బాగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ నటులు సౌత్ లో నటించిన సినిమాల్లో ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందట్లేదని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే బోమన్ ఇరానీ నటించిన తెలుగు చిత్రాల్లో ఎక్కువగా ఫ్లాప్స్ ఉన్నాయని.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన రెండిట్లో నటించారని.. ఒకటి ఇండస్ట్రీ హిట్ అవ్వగా.. మరొకటి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరి రామ్ చరణ్ కి ఏ నటుడు హిట్ ఇస్తాడా లేదా అని కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+