బాహుబలి స్టార్ హీరోపై కేసు నమోదు!!
బాహుబలి స్టార్ హీరో రానా దగ్గుబాటి ఆయన స్టైలే వేరు. నటనలో అయినా, వ్యక్తిత్వంలో అయినా రానా ది బెస్ట్ అని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇక సినిమాలలో నటనలో ప్రాణం పెట్టి చేసే రానా ఏ సినిమాపైన అయినా తన మార్కును వేస్తారు . ప్రస్తుతం తెలుగు సినిమాతో పాటు, హిందీ సినిమాలలోనూ,వెబ్ సీరీస్ లలోనూ నటిస్తూ బాగా బిజీగా ఉన్నారు రానా దగ్గుబాటి.
ఇక ఇలాంటి సమయంలో ఆయనకు షాక్ తగిలే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వర్సటైల్ హీరో, ఎప్పుడూ సరదాగా ఉండే రానా దగ్గుబాటిపై కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ భల్లాలదేవుడుగా బాగా గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి మీద FIR నమోదైంది. హైదరాబాద్ F.C ఫుట్‌బాల్ క్లబ్‌కు కో-ఓనర్‌గా ఉన్న రానాతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు హోటల్ రమడ నిర్వాహకులు.

ఇండియన్ సూపర్ లీగ్ సందర్భంగా జెంషెడ్ పూర్ కు వెళ్ళిన రానా దగ్గుబాటి బృందం అక్కడ హోటల్ లో ఉన్నారు. హోటల్ వారికి డబ్బులు ఎగ్గొట్టి వచ్చారని వారిపై కేసు నమోదు చేశారు జెంషెడ్‌పూర్‌లోని హోటల్ రమడ నిర్వాహకులు. తమ హోటల్ లో ఉండి, గదులు వాడుకుని ఆ బిల్లులు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు.
ఇండియన్ సూపర్ లీగ్ సందర్భంగా రానాతో పాటు వెళ్ళిన వారంతా 23 రూమ్స్ వాడుకుని బిల్లులు చెల్లించలేదని వారు ఆరోపించారు. ఎన్ని సార్లు అడిగినా సమాధానం లేదని, రానా దగ్గుబాటితో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్స్ 406, 420, 34 కింద ఈ మేరకు రానా దగ్గుబాటితో పాటు మరికొందరిపై FIR నమోదు చేశారు పోలీసులు.
నిజ జీవితంలో కూడా చాలా ప్రాక్టికల్ గా ఉండే రానా ఈ వ్యవహారంలో స్పందిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే తమ అభిమాన నటుడు అలాంటివాడు కాదని రానా దగ్గుబాటి ఫ్యాన్స్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications