హైదరాబాద్‌లో హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..?

వెండితెరపై తనదైన గ్లామర్‌తో, నటనతో కుర్రకారు మనసు గెలుచుకున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కేథరిన్ థ్రెసా భాగ్యనగరంలో మెరిశారు. శనివారం నాడు హిమాయత్‌నగర్‌లోని తిరుమల ఎస్టేట్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. కేథరీన్ వస్తున్నారనే సమాచారంతో ఆమెను చూసేందుకు అభిమానులు, సినీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థకు సంబంధించిన ఓ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించేందుకు కేథరిన్ విచ్చేశారు. మెరిసిపోయే డ్రెస్‌లో, చిరునవ్వు చిందిస్తూ వేదికపైకి వచ్చిన ఈ 'ఇద్దరమ్మాయిలతో' బ్యూటీని చూడగానే అభిమానుల కేరింతలతో ఆ ప్రదేశం మారుమోగిపోయింది. స్వయంగా రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించిన ఆమె, అక్కడి అత్యాధునిక సౌకర్యాలను ఆసక్తిగా పరిశీలించారు. సినిమా షూటింగ్‌ల బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, హైదరాబాద్ అభిమానుల కోసం సమయం కేటాయించి రావడం విశేషం.

Catherine Tresa Shares Her Fitness Secrets at Himayatnagar Event South Indian actress made a grand appearance

గ్లామర్ సీక్రెట్ వెనుక ఫిట్‌నెస్ మంత్ర!
ఈ సందర్భంగా కేథరీన్ థెరీసా మాట్లాడుతూ తన ఫిట్‌నెస్, గ్లామర్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "సినిమా ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా, ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, అందంపై అవగాహన పెరగడం శుభపరిణామం. లైఫ్‌స్టైల్ మారుతున్న కొద్దీ మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. 'కలర్స్ హెల్త్ కేర్ 2.0' వంటి అత్యాధునిక కేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు అంతర్జాతీయ స్థాయి ట్రీట్‌మెంట్స్ లభిస్తాయి. ముఖ్యంగా టెక్నాలజీని వాడుకుంటూ ఫిట్‌గా ఉండటం ఈ కాలంలో చాలా అవసరం" అని ఆమె పేర్కొన్నారు.

అభిమానుల సెల్ఫీ గోల..
కార్యక్రమం ముగిసిన తర్వాత కేథరీన్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. అందరికీ అభివాదం చేస్తూ, చిరునవ్వుతో పలకరించిన కేథరీన్, తనదైన స్టైల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, హెల్త్ మరియు వెల్‌నెస్ పట్ల ఆమెకు ఉన్న అవగాహనను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు.

మొత్తానికి కేథరిన్ థ్రెసా రాకతో హిమాయత్‌నగర్ వీధులు సినిమా వేడుకను తలపించాయి. సినీ గ్లామర్‌కు, హెల్త్ కేర్ టెక్నాలజీ తోడవడంతో 'కలర్స్ హెల్త్ కేర్ 2.0 ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. 5ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ ఈవెంట్, సెలబ్రిటీ ప్రెజెన్స్‌తో హైలైట్‌గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+