భీమవరం దొరబాబుగా చిరంజీవి.. ఈ సంక్రాంతికి టైటిల్, వచ్చే సంక్రాంతికి సినిమానే!!
సంక్రాంతి పండుగకు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అయి థియేటర్లలో సందడి చేస్తుంటే, ఇంతవరకు రెగ్యులర్ షూటింగ్లో అడుగు పెట్టకుండానే మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 156 వ సినిమా గురించి సినీ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చెప్పేందుకు రెడీ అయిన సినీ దర్శకుడు వశిష్ట సంక్రాంతి కానుకగా ఈరోజు టైటిల్ పోస్టర్ తో పాటు దానిని రివీల్ చేసే ఒక చిన్న వీడియోను రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో టాప్ త్రీ సినిమాల్లో ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని భవిష్యత్తులో ఎప్పటికీ చెప్పుకునే గొప్ప చిత్రంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు విశిష్ట చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు.

ఈ సినిమాలో భీమవరం దొరబాబు గా చిరంజీవి నటించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ ను నేడు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయడం చిరంజీవి ఫ్యాన్స్ కు పెద్ద పండుగ అని చెప్పాలి. ఈ చిత్ర దర్శకుడు వశిష్ట సినిమా విషయంలో చూపిస్తున్న కాన్ఫిడెన్స్ ఈ సినిమా స్క్రిప్ట్ అంత బలంగా ఉంది అన్న సంకేతాలను ఇస్తుంది.
సోషియో ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా చిరు భీమవరం దొరబాబు గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో చిరంజీవి అందరిని అలరిస్తారని ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.
అక్టోబర్ నెల ఆఖరి వరకు సినిమా చిత్రీకరణ చేసుకొని ఆపై పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ ఫాంటసీ డ్రామాకు చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ సినిమా కోసం విశ్వంభర అనే టైటిల్ తో పాటు మరో పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టైటిల్ ప్రకటించనున్న క్రమంలో చిత్ర టైటిల్ కోసం మెగా ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు












Click it and Unblock the Notifications