మొగల్తూరులో రూ.3 లక్షలకు ఇల్లు అమ్మేసిన విమర్శపై ఇప్పుడు స్పందించిన చిరంజీవి

స్వయంకృషితో, ఎన్నో అవమానాలను తట్టుకుని చిత్రసీమలో శిఖరాగ్రాన నిలిచిన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సాధారణ నటుడి నుంచి తిరుగులేని 'స్టార్‌డమ్' సంపాదించుకున్న ఆయన ప్రయాణంలో విజయాలతో పాటు విమర్శలు, రాజకీయంగా ఎదుర్కొన్న నిందలు తక్కువేమీ కావు. అయితే, దశాబ్ద కాలంగా ఆయన పేరుతో ప్రచారంలో ఉన్న ఒక ప్రధానమైన నింద... "సొంత ఊరు మొగల్తూరులోని ఇంటిని లైబ్రరీకి ఇవ్వమంటే ఇవ్వకుండా, కేవలం 3 లక్షల రూపాయలకు ఆశపడి అమ్మేశారు" అనేది. ముఖ్యంగా ఆయన 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టిన సమయంలో ఈ వార్త తీవ్ర సంచలనం సృష్టించింది.

చిరంజీవి వద్దంటే బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టాడు
చిరంజీవి వద్దంటే బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టాడు

అసలు నిజాన్ని బయటపెట్టిన చిరు

ఇన్నాళ్లూ ఈ విమర్శను సైలెంట్‌గా భరిస్తూ వచ్చిన చిరంజీవి, ఎట్టకేలకు ఆ ఘటన వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టారు. తనపై వచ్చిన ఈ ప్రచారంపై ఆయన స్పందిస్తూ... ఆ ఆస్తి అసలు తనదే కాదని స్పష్టం చేశారు. మొగల్తూరులోని ఆ ఇల్లు తన తల్లిగారి తమ్ముడిదని, తన సొంత ఆస్తి కానప్పుడు దానిపై నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మామయ్య తన వ్యక్తిగత అవసరాల కోసం ఆ ఇంటిని అమ్ముకుంటే, కేవలం తన పేరును ఆపాదించి బురదజల్లే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారాన్ని నడిపారని, అది రాజకీయంగా ప్రజారాజ్యం పార్టీపై కూడా ప్రతికూల ప్రభావం చూపిందని గుర్తుచేశారు.

సినీ పరిశ్రమలో సంచలనం.. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి హారర్ చిత్రం?
సినీ పరిశ్రమలో సంచలనం.. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి హారర్ చిత్రం?
Chiranjeevi has now responded to the criticism regarding the sale of a house in Mogalturu for 3 lakh

చేతల్లో నిరూపించుకున్న మెగాస్టార్

ఈ నిందలు, విమర్శలు ఎలా ఉన్నా... తాను పుట్టిన నేల పట్ల చిరంజీవి తన ప్రేమాభిమానాలను చేతల్లోనే నిరూపించుకున్నారు. ఒకపక్క తనపై ఈ నిందలు మోస్తూనే, మరోపక్క తన మిత్రుడు సత్యం సహకారంతో మొగల్తూరులో సొంత నిధులతో ఒక సుందరమైన లైబ్రరీని నిర్మించారు. ఆ భవనానికి "చిరంజీవి గ్రంథాలయం" అని పేరు పెట్టారు. ఇప్పటికీ ఆ లైబ్రరీ అక్కడి ప్రజలకు, విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ విజయవంతంగా నడుస్తోంది.

తనది కాని ఆస్తి విషయంలో కోట్లు సంపాదించే చిరంజీవి 3 లక్షలకు కక్కుర్తి పడ్డారంటూ కొందరు చేసిన ప్రచారం వెనుక ఎంతటి కుట్ర ఉందో ఈ నిజాలు తేటతెల్లం చేస్తున్నాయి.మరోవైపు చిరంజీవి వరుస భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'కాకా' అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో పాటు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+