చిరంజీవి వద్దన్న కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలకృష్ణ

సినీ పరిశ్రమలో కథను తయారుచేసే దర్శకులుకానీ, రచయితలు కానీ ఆ కథకు అనుగుణంగా ఏ హీరో బాగుంటాడు? అని ఆలోచించి అతని బాడీ లాంగ్వేజ్ కు అనగుణంగా కథను తయారుచేయడంతోపాటు స్క్రీన్ ప్లే, డైలాగులు సమకూర్చుకుంటారు. తీరా ఆ కథను వారు అనుకున్న హీరో దగ్గరకు తీసుకువెళితే అతనికి నచ్చకపోవచ్చు.. లేదంటే కాల్షీట్లు ఖాళీ లేకపోవచ్చు.. మరే ఇతర కారణాలవల్లో ఆ సినిమా చేయడానికి వీలుపడటం కుదరదు. దీంతో సదరు దర్శకులు, రచయితలు ఆ కథను మరో హీరోకు వినిపిస్తారు. అతినికి నచ్చితే తన బాడీలాంగ్వేజ్ కు అనగుణంగా కొన్ని మార్పు చేర్పులు చేసి పట్టాలెక్కిస్తారు.

మరపురాని చిత్రంగా నిలిచింది
కెరీర్ ప్రారంభంలో బాలయ్యకు ఇండస్ట్రీ హిట్ అందించిన సినిమా మంగమ్మగారి మనవడు. దర్శకుడు కోడి రామకృష్ణ ముందుగా ఈ సినిమాను చిరంజీవితో చేయాలనుకున్నారు. తనకు కథ వినిపించిన తర్వాత చిరుకు నచ్చలేదు. దీంతో కోడి రామకృష్ణ ఆ కథను బాలకృష్ణకు వినిపించగా తనకు వెంటనే నచ్చడంతో సినిమాను పట్టాలెక్కించారు. భానుమతి రామకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. సుహాసిని కథానాయికగా నటించింది. భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ఎస్.గోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. తిరుగులేని విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించడంతోపాటు బాలయ్య కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది.

chiranjeevi rejected mangammagari manavadu story balakrishna hit the industry with the same story

చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటారు
తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక రోజులు ఆడిన సినిమాల్లో ఇది కూడా స్థానం సంపాదించుకుంది. దాదాపు 560 రోజులు ప్రదర్శింపబడి రికార్డులు నెలకొల్పింది. అయితే ఈ సినిమా చేయనందుకు చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటారు. తన సన్నిహితుల దగ్గర కూడా దాదాపుగా ఇదే విషయాన్ని తరుచుగా ప్రస్తావించేవారు. ఆ సమయంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే చిరు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా చేశారు. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఏదేమైనప్పటికీ కొందరు హీరోలు వద్దన్న కథలు వేరే హీరోలకు వరంలా మారతాయి. అలా చిరు వద్దన్న కథ బాలయ్యకు మరపురాని విజయాన్ని అందించి చాలా ప్రత్యేకంగా నిలిచింది. అప్పటినుంచి భార్గవ్ ఆర్ట్స్ తో బాలకృష్ణకు విడదీయరాని బంధం ఏర్పడింది. తన సొంత బ్యానరులా భావించేవారు. ఈ బ్యానరుపై అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+