చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్ డేట్ ఫిక్స్.. నెల గ్యాప్ లో తండ్రీకొడుకుల బాక్సాఫీస్ విధ్వంసం..!

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడు సైతం ఆత్రుతగా ఎదురుచూస్తాడు. ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు చిరంజీవి. ఆర్ఆర్ఆర్, ఓజీ సినిమాల్ని దాటి ఈ మూవీకి కలెక్షన్లు వచ్చాయి. దాంతో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీకి సంబంధించిన కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ మూవీని ఈ ఏడాది జులై 10 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ అధికారికంగా ప్రకటించారు.

ఇక నెల రోజుల వ్యవధిలోనే అంటే జూన్ 4 న పెద్ది గ్రాండ్ రిలీజ్ కానుంది. అటు జులై 10న మెగాస్టార్ విశ్వంభర మూవీతో రానున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ ర్యాంపేజ్ కు కౌంటింగ్ స్టార్ట్ అయిందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవానికి విశ్వంభర మూవీ ఈపాటికే రిలీజ్ కావాల్సింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తికాకపోవడంతో పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే మెగాస్టార్ కూడా గ్రాఫిక్స్ వర్క్‌ కు పూర్తి సమయం ఇచ్చినట్లు సమాచారం. అలాగే జూలై నాటికి గ్రాఫిక్స్ పనులన్నీ పూర్తి చేసి.. వెండితెరపై ఒక విజువల్ వండర్‌ ను చూపించాలని దర్శకుడు వశిష్ట పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi Vishwambhara Set for July 10 Release Date GoesViral Across Social Platforms Chiranjeevi

విశ్వంభర మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర మూవీ రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మెగాస్టార్ చేస్తున్న పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ సినిమా కావడంతో.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రిలీజ్ తర్వాత ఈ మూవీ ఏ మేరకు సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+