నీ సినిమాకు టీ ఖర్చులు కూడా రాలేదేంటన్నా..!!

పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. అటు టాలీవుడ్ తోపాటు ఇతర భాషల నుంచి చాలా సినిమాలే రిలీజ్ అవుతుంటాయి. పండగ సీజన్ లో సాధారణంగా సినిమాలకు హిట్ టాక్ వస్తే చాలు.. బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్ అవుతుంటాయి. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే వస్తుంటాయి. అందుకే చాలామంది దర్శకనిర్మాతలు తమ సినిమాను పండగ సీజన్ లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఈ దసరా పండగకి ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 చిత్రం.. అలాగే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన రణబాలి మూవీ రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు కోలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ కళ్యాణం మూవీ కూడా రిలీజ్ అయింది. జైలర్ 2, రణబాలి సినిమాలు బాక్సాఫీస్ ముందు హిట్ టాక్ తెచ్చుకోగా.. క్రేజీ కళ్యాణం సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. ఇక నూతన దర్శకుడు బద్రప్ప గాజుల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. యారో సినిమాస్‌ పతాకంపై బూసం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మించారు.

జైలర్ 2, రణబాలి చిత్రాలకు పోటీగా వచ్చిన ఈ క్రేజీ కళ్యాణం మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు తరుణ్ భాస్కర్, నరేష్ వీకే, అఖిల్ రాజ్, కిరీటి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. ఇక క్రేజీ కళ్యాణం మూవీ పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. తండ్రీకూతుళ్ల అనుబంధాల్ని.. ఓ ప్రేమకథకు ముడిపెట్టి అలాగే ఓ రూరల్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు బద్రప్ప గాజుల ప్రయత్నం చేసినట్లు స్పష్టం అవుతోంది. అయితే కథలో కొత్తదనం లేకపోవడం.. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అంత ఆసక్తిగా లేకపోవడంతో ఈ సినిమాను ప్రేక్షకులు పక్కనపెట్టినట్లు స్పష్టం అవుతోంది.

CrazyKalyanam First day collections for the Anupama Parameswaran Tharun Bhasker film Crazy Kalyanam

ఇక క్రేజీ కళ్యాణం మూవీ కలెక్షన్స్ చూస్తే.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాల్ని చూస్తోంది. ఈ మూవీ ఫస్ట్ డే కేవలం రూ. 23 లక్షలే కలెక్ట్ చేసినట్లు సాక్నిల్క్ అనే వెబ్ సైట్ స్పష్టం చేసింది. ఈ మేరకు చిత్రానికి ఫస్ట్ రోజు టీ ఖర్చులు కూడా రాలేదని మాట్లాడుకుంటున్నారు. పండగ సీజన్ లో ఈ సినిమాకు ఇలాంటి కలెక్షన్స్ రావడం దారుణమనే చెప్పాలి. జైలర్ 2, రణబాలి చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+