అంతర్జాతీయ టూరిజం హబ్‌గా పుదుచ్చేరి.. 'పాండీ మెలంజ్ 2027' కు సర్వం సిద్ధం!

పుదుచ్చేరి పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు, ఈ ప్రాంత సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పేందుకు ఉద్దేశించిన 'పాండీ మెలంజ్ 2027' అధికారిక లోగో, ఎంబ్లమ్‌ను పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి ఘనంగా ఆవిష్కరించారు. పుదుచ్చేరిలోని గాంధీ తిడాల్ వేదికగా శుక్రవారం(అక్టోబర్ 16) జరిగిన ఈ లాంచ్ ఈవెంట్లో ముఖ్యమంత్రితో పాటు పుదుచ్చేరి పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'పాండీ మెలంజ్ 2027' ప్రత్యేక ఎమోషనల్ వీడియోను మంత్రి మల్లాది కృష్ణారావు విడుదల చేశారు.

భారత్- వెస్టిండీస్ సిరీస్ డిసైడర్: పరుగుల వరదా? వర్షం బెడదా?
భారత్- వెస్టిండీస్ సిరీస్ డిసైడర్: పరుగుల వరదా? వర్షం బెడదా?

పుదుచ్చేరి టూరిజం డిపార్ట్మెంట్, టెక్ షాట్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ ఈవెంట్ 'సంస్కృతి, సృజనాత్మకత, వేడుక' అనే ఇతివృత్తంతో రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా కళలు, సంగీతం, ఫ్యాషన్, ఆహార సంస్కృతి , ఆరోగ్యం, వారసత్వ సాంస్కృతిక వేడుకలను ప్రతిబింబించేలా అనేక కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ముఖ్యంగా 2027 జనవరిలో విద్య, ఆధ్యాత్మికత, ఆరోగ్య రక్షణ అంశాలపై వివిధ రంగాల నిపుణులతో సదస్సులు నిర్వహించనుండగా.. ఫిబ్రవరి 2027లో అంతర్జాతీయ స్థాయి నృత్య ప్రదర్శనలు, ప్రత్యక్ష సంగీత కచేరీలతో కూడిన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

Pondy Melange 2027 Puducherry CM Rangasamy Unveils Official Logo and Emblem event aims to boost global tourism

ఈ సందర్భంగా సీఎం ఎన్.రంగసామి మాట్లాడుతూ.. పుదుచ్చేరికి దేశ నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని.. ఇలాంటి సాంస్కృతిక ఈవెంట్లు పర్యాటకాన్ని మరింత ప్రోత్సహిస్తూ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం దేశంలోని వివిధ రాష్ట్రాల పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోందని.. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఇక్కడి పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పుదుచ్చేరి సీఎం ఎన్.రంగసామి పేర్కొన్నారు. పాండీ మెలంజ్ 2027ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Viral Video: ప్రధాని మోదీ ప్రశంసలు... వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!
Viral Video: ప్రధాని మోదీ ప్రశంసలు... వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

ఈ ప్రాజెక్టులో భాగంగా 2027 జనవరి నెలలో విద్య, ఆధ్యాత్మికత, ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు సదస్సులను నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి విచ్చేసే ప్రముఖులు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొని విజ్ఞాన మార్పిడిపై చర్చలు జరపనున్నారు. వీటిని కొనసాగిస్తూ 2027 ఫిబ్రవరిలో సంగీత విభావరి, అంతర్జాతీయ నృత్య ప్రదర్శనలు, పలు వినోదాత్మక కార్యక్రమాలను స్థానికులు, పర్యాటకుల కోసం ప్లాన్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+