తాజా పరిణామాల వేళ కూటమి నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు...!!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల రెండో రోజూ పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. రేపు నామినేషన్లకు చివరి రోజు. కూటమి - వైసీపీ తమ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. ఇదే సమయంలో తాజా పరిణామాలతో కూటమి అప్రమత్తం అయింది. సీఎం చంద్రబాబు మూడు పార్టీల నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు.

నామినేషన్ల వేళ కూటమి నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసారు. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ సమన్వయ కమిటీలకు స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాన్ని దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి మూడు పార్టీల నేతలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేసారు.

మచిలీపట్నం మేయర్ అభ్యర్ది ఖరారు - టీడీపీ రెండో జాబితా విడుదల..!!
మచిలీపట్నం మేయర్ అభ్యర్ది ఖరారు - టీడీపీ రెండో జాబితా విడుదల..!!
cm-chandra-babu-key-directions-for-alliance-parties-leaders-over-local-body-elections-campaign-and

చంద్రబాబు దిశా నిర్దేశం

నామినేషన్ల దాఖలుకు కూటమి నేతలు అభ్యర్థులతో కలిసే వెళ్లాలని సూచించారు. నిన్నటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ చర్యలపై అప్రమత్తంగా ఉండాలని.. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టం చేసారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యత, సమన్వయమే కీలకమని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కాగా.. టీడీపీ మచిలీపట్నం మేయర్ తో పాటుగా మరో 21 మున్సిపాల్టీలకు ఛైర్మన్ అభ్యర్ధులను ప్రకటించారు. ఇంకా రెండు మేయర్ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. గుంటూరు, ఒంగోలు మేయర్ అభ్యర్ధుల పైన తుది కసరత్తు జరుగుతోంది. ఈ సాయంత్రం వారి పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+