తిరువూరు సీటు జనసేనకు - కొలికపూడి తిరుగుబాటు, మరో అభ్యర్ధి..!!
స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం పై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసంతృప్తులు బయట పడుతున్నాయి. కూటమి నుంచి ఇంకా తుది జాబితాలు వెల్లడి కావాల్సి ఉంది. నామినేషన్లకు ఒక్క రోజే సమయం. ఇదే సమయం లో కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. జనసేనకు కేటాయించిన తిరువూరు సీటులో స్థానిక ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తున్నారు. తన మద్దతుతో కొత్త అభ్యర్ధిని బరిలోకి దించుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం పూర్తయింది. అభ్యర్దులను విడతల వారీగా ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా తిరువూరు మున్సిపాల్టీని జనసేనకు కేటాయించారు. దీంతో.. జనసేన తమ అభ్యర్ధిని సైతం ప్రకటించింది. మాధవి తమ అభ్యర్దిగా ప్రకటించిన జనసేన.. అక్కడ గెలుపు కోసం ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించింది. కాగా.. ఇదే సమయంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఈ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. మరో అభ్యర్ధిని బరిలోకి దించుతున్నట్లు ప్రకటన చేసారు. టీడీపీ నుంచి నాగ శ్రావణి పోటీలో ఉంటారని ప్రకటించారు. రేపు నామినేషన్ కు అందరూ కలిసి రావాలని సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసారు.

కొలికపూడి నిర్ణయంతో వాట్ నెక్స్ట్
ఇప్పుడు కొలికపూడి నిర్ణయం కూటమి నేతలకు అంతు చిక్కటం లేదు. జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. అయితే, తిరువూరు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించడంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా జనసేనకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో.. ఈ కేటాయింపును వ్యతిరేకిస్తూ ఆయన మున్సిపల్ ఎన్నికల కోసం తిరువూరులో సొంతంగా అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి ప్రకటించారు. ఇప్పుడు కొలికపూడి నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. చాలా కాలంగా కొలికపూడి తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. టీడీపీ నాయకత్వం కీలక హెచ్చరికలు చేసినా.. ఇప్పుడు మరోసారి స్థానిక ఎన్నికల్లో వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.













Click it and Unblock the Notifications
