అల్లు అర్జున్ లో ఉన్న క్వాలిటీ రామ్ చరణ్ లో లేదు!

మెగా కుటుంబం నుంచి వారసులిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అప్పటికే కేరళ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ చేతిలో ఉన్న సినిమాలతో అంతర్జాతీయ మార్కెట్ పై కూడా దృష్టిసారించారు. ఈ ఇద్దరు హీరోల పయనం ఇలా కొనసాగుతున్న తరుణంలో సోషల్ మీడియాలో వీరి అభిమానుల మధ్య ఒక విషయం చర్చకు దారితీసింది.

అల్లు అర్జున్ లో ఉండే క్వాలిటీ రామ్ చరణ్ లో లేదని బన్నీ అభిమానులు అంటున్నారు. ఏ విషయమైన ఓపెన్ గా మాట్లాడటమేకాదు.. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా బన్నీ చెప్పేస్తాడు. అంతేకాదు.. ఎంతో రొమాంటిక్ గా ఉంటాడు. తన భార్య స్నేహతో కూడా ఎంతో రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేస్తుంటారు. అయితే రామ్ చరణ్ మాత్రం అలా ఉండదు. ఏ విషయాన్ని బహిరంగంగా చెప్పడు. తన తండ్రి, ఇతర సన్నిహితులతోనే చర్చిస్తాడు. చాలావరకు ఎక్కువ విషయాలన్నింటినీ గోప్యంగా ఉంచుతాడు.

defference between allu arjun and ramcharan

భార్య ఉపాసనతో దిగిన ఫొటోలు కూడా షేర్ చేస్తుంటారుకానీ అవి అందులో రామ్ చరణ్ ఎంతో లిమిట్ గా ఉంటాడు. ఉపాసన ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రమే కాస్తంత రొమాంటిక్ మూడ్ తో ఉన్న ఫొటోలను చెర్రీ షేర్ చేశాడు. ఇవి తప్పితే నటన, నృత్యాల పరంగా మాత్రం ఇద్దరూ సమానంగానే ఉంటారంటారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఈ విషయాలను చెర్రీ, బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో చర్చకు పెట్టారు. ఎవరికివారు తమ హీరోనే గొప్ప అని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో ఈ ఇద్దరు హీరోలు మాత్రం స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా అంతర్జాతీయస్థాయి దిశగా పయనించేందుకు ఇప్పుడిప్పుడే అడుగులు వేసుకుంటూ వెళుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+