Kara First Review: ధనుష్ ఖాతాలో మరో హిట్టు..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమా అంటే అటు తమిళ ప్రేక్షకులతోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా తెగ ఎదురు చూస్తుంటారు. ఆయన ఎంచుకునే కథలు అలా ఉంటాయి. గతేడాది కుబేర, ఇడ్లీ కొట్టు, తేరే ఇష్క్ మేన్ ఇలా ఏకంగా మూడు సినిమాలతో అలరించిన ధనుష్ ఈ ఏడాది 'కర' సినిమాతో అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ధనుష్ సరసన హీరోయిన్ గా మమితా బైజు నటించింది. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌‌‌ పై ఐషరి కె గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 30న తమిళంతోపాటుగా తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ధనుష్ సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకున్నాయి.

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్, మమితా బైజు జంట సందడి చేశారు. ఈ కార్యక్రమానికి గెస్టులుగా హాజరైన మెగా హీరో సాయి దుర్గ తేజ్, దర్శకులు బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ వేడుకలో ధనుష్ మాట్లాడతూ.. ఇదొక సాధారణ యువకుడి కథ అని అన్నారు. కుబేర, ఇడ్లీ కొట్టు తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు.

కర మూవీ కథ విషయానికి వస్తే.. ఇది గ్రామీణ ప్రాంత నేపథ్యంలో సాగుతుంది. ఓ గ్రామానికి చెందిన యువకుడిగా ధనుష్ నటించారు. ఆయన పాత్ర పేరు కరస్వామి. అతను ఓ దొంగ. అయితే ఆ పని మానేసి మళ్లీ ఊరికి తిరిగి వస్తాడు. కానీ కొన్ని కారణాలతో మళ్లీ దొంగగా మారతాడు. బ్యాంకుల్ని లూటీ చేస్తుంటాడు. కర బ్యాంకులను ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నాడు..? అతని భార్య మమితా బైజు ఏం చేసింది..? అనేదే సినిమా కథ..

Dhanush KARA First Review Released Here s What Critics and Fans Are Saying KARA first review

ఇక తాజాగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్.. కర మూవీపై రివ్యూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. " నేను ఆల్రెడీ సినిమా చూశాను. సినిమా బాగా వచ్చింది. ఇదొక స్లో బర్న్ థ్రిల్లర్.. ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతుంది అని తెలిపారు. దాంతో ఈ పోస్టు వైరల్ అయింది. కర తో మరో హిట్టు అంటూ ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+