7 గంటలు డంప్ యార్డులో ఉన్నాం.. రష్మిక అలా అంటుందని అనుకోలేదు !

కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఇప్పటికే మొదటి సింగిల్ "పోయిరా మామా", రెండవ సింగిల్ "అనగనగ కథ" సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అలానే టీజర్ కి సైతం అదిరిపోయే రియాక్షన్స్ దక్కాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని 'పీ పీ డుమ్‌ డుమ్‌' పాటని ముంబైలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో ధనుష్, నాగార్జున, రష్మిక సహా పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ధనుష్.. రష్మికపై షాకింగ్ కామెంట్స్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

dhanush-shocking-comments-on-rashmika-at-song-launch-event-in-mumbai

ధనుష్ ఏమన్నారంటే..

కుబేర తనకు చాలా స్పెషల్ సినిమా అని.. మనసుకు బాగా దగ్గరైన మూవీ అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో నాగార్జునతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బెగ్గర్ క్యారెక్టర్ ని ప్లే చేశానని.. ఈ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్‌, హోమ్‌ వర్క్‌ చేశా అని చెప్పనన్నారు. శేఖర్ బ్రిలియంట్ డైరెక్టర్ అని ఆయనను ఫాలో అయ్యానని తెలిపారు. శేఖర్ వెరీ ప్యూర్ పర్సన్ అని.. ఆయన వల్లే ఈ సినిమా చేశానన్నారు.

అంతే కాకుండా ఈ చిత్రంలో ఓ సీన్ కోసం డంప్‌ యార్డ్‌లో దాదాపు 7 గంటల పాటు తాను, రష్మిక షూటింగ్‌లో పాల్గొన్నామని వివరించారు. అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉందని.. తనకేం వాసన రావట్లేదు అని చెప్పిందని అన్నారు. మరి ఆమెకు ఏమైందో తనకు తెలియదు (నవ్వుతూ) అని.. ఎటువంటి అసౌకర్యంగా ఫీలో అవ్వకుండా సినిమా కోసం అలా కష్టపడడం గొప్ప విషయమని పొగిడారు. సినిమా తప్పుకుండా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+