కేటీఆర్ బర్త్ డే దావత్ ఇస్తే - రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ బర్త్ డే పై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలీలో స్పందించారు. బర్త్ డే దావత్ ఇస్తా అంటే విష్ చేస్తా, కానీ కేటీఆర్ దావత్ తీసుకోవాలన్నా డౌట్ ఉందని వ్యాఖ్యానించారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు. గ్లోబరీనా తప్పిదాల వల్ల 27 మంది చనిపోయారని.. ఆ సంస్థ పేరు మార్చుకొని CBSE పరీక్షల కాంట్రాక్టు పొందిందని చెప్పుకొచ్చారు
కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ మరోసారి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థగా చెబుతూ.. ఆ సంస్థ పేరు మార్చుకొని CBSE పరీక్షల కాంట్రాక్టు పొందిందని చెప్పారు. వీటి ఆధారంగానే నీట్ కుంభకోణం జరిగిందన్నారు. గ్లోబరీనా తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
కేటీఆర్ జన్మదినం పైనా స్పందించారు. 'కేటీఆర్ పుట్టిన రోజు దావత్ ఇస్తాడో అడగాలి. కేటీఆర్ ఇచ్చే దావత్ నేను తీసుకోలేనేమో. ఆయనవి అన్నీ వేరే పార్టీలు' అంటూ సెటైర్ విసిరారు. హరీశ్ గొప్పవాడైతే మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. అతి తెలివి తేటలతో ఏదిపడితే అది మాట్లాడతానంటే నడవదని హరీశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేతలు కన్నెపెల్లి పంపు హౌజ్ గురించి మాట్లాడుతున్నారని... మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ గురించి మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొడతారని మండిపడ్డారు. మేడిగడ్డ కట్టింది, కూల్చింది బీఆర్ఎస్ వాళ్లే అని వ్యాఖ్యానించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అయిపోయే వరకూ ఎమ్మెల్యేలను గ్రామాల్లోనే ఉండమని చెప్పినట్లు వెల్లడించారు. SIR ప్రక్రియ నాయకులకు సంబంధించింది కాదని, ప్రజలకు సంబంధించిందని స్పష్టం చేశారు. తనకు రెండు ఓట్లు ఉన్నాయని అంటున్నారని... కలెక్టర్ అనుమతి తీసుకొని తన గ్రామంలో ఉన్న ఓటును కొడంగల్‌కు మార్చుకున్నానని వివరించారు. గతంలో కొడంగల్ ప్రాంతం కర్ణాటకలోని జిల్లాలో ఉండేదని చెప్పిన రేవంత్.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేసినప్పుడు కొడంగల్ పాలమూరులోకి వచ్చిందని వివరించారు.












Click it and Unblock the Notifications