రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను.. తేల్చి చెప్పిన మ‌ల్లు బ్యూటీ..!

సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పుడూ తమ అభిమానులు, సినీ ప్రియులతో ఎప్పుడూ టచ్ లో ఉండాలని కోరుకుంటారు. అటు ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఎప్పుడు ఏ పోస్టు పెడతారా..? ఏ వీడియో పెడతారా..? అంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. తమ ఫేవరెట్ సెలబ్రిటి నుం ఏ చిన్న అప్డేట్ వచ్చినా దాన్ని క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. అటు సెలబ్రిటీలు కూడా తమ లైఫ్ లో జరిగే ప్రతి క్షణాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంటారు.

ప్రస్తుతం చిన్న యాక్టర్ దగ్గరనుంచి పాన్ ఇండియా స్టార్ హీరోల వరకూ అందరూ సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. అందులో తమ వ్యక్తిగత విషయాలు, మూవీస్ సంబంధించిన అప్డేట్స్ ను పెడుతుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం అసలు తనకు సోషల్ మీడియానే వద్దంటోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. గతేడాదిలోనే ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాను డీ యాక్టివేట్ చేసింది. ఆమె ఎవరో కాదు మల్లు బ్యూటీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి..

గతేడాది ఇన్ స్టాగ్రామ్ కు గుడ్ బై చెప్పిన మల్లు బ్యూటీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి అకౌంట్ ను పూర్తిగా డీయాక్టివేట్ చేసింది. ఇప్పటికీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ ఆమె యాక్టివ్ గా కనిపించడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా లేకుండానే జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటోంద‌ని.. తిరిగి అందులోకి అడుగుపెట్టే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని స్ప‌ష్టం చేసింది మల్లు బ్యూటీ. ఇందుకు సంబంధించిన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. సోషల్ మీడియాను వినియోగించే సమయంలో తాను తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు పేర్కొంది.

AishwaryaLekshmi Mallu beauty states I wouldn t use social media even if offered Rs 100 crore

ఆన్ లైన్ మాధ్యమాల్లో కాకుండా నేరుగా అభిమానులను, ప్రజలను కలవడం తనకు మరింత ఆనందంగా అనిపిస్తోందని మల్లు బ్యూటీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి తెలిపింది. ఎవరైనా రూ.100 కోట్లు ఇస్తామని చెప్పినా సోషల్ మీడియా వైపు వెళ్లనని.. డబ్బు కోసం తన ప్రశాంతతను కోల్పోవాలనుకోవడం లేదని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+