త్వరలో చేతికి ప్లాస్టిక్ నోట్లు! RBI మాస్టర్ ప్లాన్!!

ఇండియా త్వరలోనే సాంప్రదాయ కాగితపు కరెన్సీ స్థానంలో పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను వినియోగించే దేశాల జాబితాలో చేరనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కరెన్సీ ముద్రణ సంస్థ భార రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL), జూలై 17, 2026న.. భారతీయ నోట్ల కోసం సెక్యూరిటీ-గ్రేడ్ పాలిమర్ సబ్‌స్ట్రేట్‌ను సరఫరా చేయమని తయారీదారులను ఆహ్వానిస్తూ అంతర్జాతీయ టెండర్ విడుదల చేసింది.

ఆర్‌బీఐ ఇంకా ప్లాస్టిక్ కరెన్సీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించనప్పటికీ.. దాని గ్లోబల్ టెండర్‌ను పాలిమర్ కరెన్సీ క్షేత్రస్థాయి ప్రయోగాల దిశగా వేసిన మొదటి స్పష్టమైన అడుగుగా విస్తృతంగా పరిగణిస్తున్నారు. ఈ ప్రయోగాలు బహుశా రూ.10, రూ.20 విలువ గల నోట్లపై ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియ కోసం 68,000 రీముల బైయాక్సివల్లీ ఓరియంటెడ్ పాలిప్రొపైలిన్ ఆధారిత పాలిమర్ పదార్థాన్ని కోరింది. ఈ క్షేత్రస్థాయి ప్రయోగాలు గనుక విజయవంతమైతే కాగితపు కరెన్సీకి బదులుగా ఎక్కువ విలువ గల డినామినేషన్లలో కూడా పాలిమర్ నోట్లను ముద్రించే అవకాశాలు ఉన్నాయి.

Plastic Currency in India RBI Master Plan for Polymer Notes Explained Security Features

ఆర్బీఐ ఇప్పుడు ఈ మార్పును ఎందుకు కోరుకుంటోంది?
దీనికి తక్షణ కారణం మన్నిక, ఖరీదు కావచ్చు. మనం రోజువారీగా వాడే రూ.10, రూ.20 వంటి తక్కువ విలువ గల నోట్లు వేగంగా చేతులు మారుతుంటాయి. ఫలితంగా అవి అధిక విలువ గల నోట్ల కంటే చాలా వేగంగా మురికిగా, చిరిగిపోయి , చలామణికి పనికిరాకుండా పోతాయి. కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు మానవ చేతుల నుంచి వచ్చే మురికి, నూనె లేదా తేమను పీల్చుకోవు. తద్వారా ఇవి చలామణిలో ఉన్నంత కాలం పరిశుభ్రంగా, ధృడంగా ఉంటాయి. 'ప్లాస్టిక్ మనీ' అని పిలవబడినప్పటికీ.. పాలిమర్ నోట్లను సాధారణ ప్లాస్టిక్‌తో తయారు చేయరు. వాటిని ప్రత్యేకంగా బ్యాంక్ నోట్ల కోసం రూపొందించిన సాధారణంగా బైయాక్సియల్లీ ఓరియెంటెడ్ పాలిప్రొఫైలిన్ వంటి ప్రత్యేకంగా తయారు చేయబడిన పాలిమర్ సబ్‌స్ట్రేట్ నుంచి తయారు చేస్తారు.

ప్లాస్టిక్ నోట్లు ఎంత కాలం మన్నుతాయి?
ప్లాస్టిక్ నోట్ల అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి మన్నిక. అధ్యయనాలు, ఆర్బీఐ అనుభవం ప్రకారం.. సాంప్రదాయ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు సాధారణంగా రెండు నుంచి రెండున్నర రెట్లు ఎక్కువ కాలం చలామణిలో ఉంటాయి. వాటి రంధ్రాలు లేని ఉపరితలం తేమ, మురికి, చెమట, జిడ్డు, రోజువారీ అరుగుదల, చిరుగుదలను తట్టుకునేలా చేస్తుంది.

దీనివల్ల ఆర్‌బీఐ ముద్రణ ఖర్చులు తగ్గుతాయా?
ముఖ్యంగా కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్ల తయారీకి సాధారణంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటులో ఉండటం వల్ల కేంద్ర బ్యాంకులు ఆ అదనపు ఖర్చును తిరిగి రాబట్టుకుంటాయి. అంటే రీప్లేస్‌మెంట్ ప్రింట్ రన్‌ల అవసరం తక్కువగా ఉంటుంది. అదనంగా దీనివల్ల రవాణా ఖర్చులు చాలా తక్కువగా, అరుదుగా ఉంటాయి, పాత నోట్లను నాశనం చేయడం తగ్గుతుంది. దీర్ఘకాలిక కరెన్సీ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఆర్‌బీఐ మొదటగా రూ.10, రూ.20 నోట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చలామణిలో ఈ నోట్లు అత్యధికంగా చలామణికి పనికి రాకుండా పోతాయి.

ప్లాస్టిక్ నోట్లు నకిలీ కరెన్సీని అరికట్టగలవా?
పూర్తిగా కాకపోయినా అవి నకిలీ చేయడాన్ని గణనీయంగా కష్టతరం చేస్తాయి. కాగితపు నోట్లలా కాకుండా, పాలిమర్ కరెన్సీ నోట్లలో పారదర్శక కిటికీలు, లోహపు అంకెలు, పొందుపరిచిన హోలోగ్రాఫిక్ అంశాలు, అయస్కాంత సూడో థ్రెడ్‌లు, నీడ చిత్రాలు, ఇంద్రధనుస్సులా మెరిసే భద్రతా నమూనాలు ఉండడం వల్ల నకిలీ వాటిని తయారు చేయడం చాలా కష్టం. నకిలీదారులు సాధారణ కాగితాన్ని కాపీ చేసినట్లు పాలిమర్ పదార్థాన్ని, అందులోని భద్రతా ఫీచర్లను కాపీ చేయడం సాధ్యపడదు.

దృష్టి లోపం ఉన్న వినియోగదారులకు పాలిమర్ నోట్సు మేలైనవా?
పాలిమర్ కరెన్సీ నోట్ల ఉపరితలంపై ఉబ్బెత్తుగా ఉండే గుర్తులు తయారు చేయవచ్చు. కాగితపు నోట్లపై ఉండే గుర్తులు కాలక్రమేణా అరిగిపోతాయి. కానీ పాలిమర్ నోట్లపై ఇవి నోటు జీవితకాలం ఉన్నంతవరకు అలాగే ఉంటాయి. దీనివల్ల దృష్టి లోపం ఉన్న వినియోగదారులకు నోటు విలువను గుర్తించడం సులభతరం అవుతుంది. ఇవి ప్లాస్టిక్ నోట్లు అయినప్పటికీ.. ఎక్కువ కాలం మన్నుతాయి కాబట్టి తక్కువ నోట్లను ముద్రించాల్సి వస్తుంది. పైగా ఇవి పాడైపోయిన తర్వాత కాల్చివేయాల్సిన అవసరం లేకుండా.. ముక్కలు చేసి ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులుగా మళ్లీ వినియోగించవచ్చు. మొత్తం పర్యావరణ ప్రయోజనం ఆ పదార్థం వల్ల కాకుండా, కాలక్రమేణా తక్కువ రీప్లేస్‌మెంట్ నోట్లను ఉపయోగించడం వల్ల వస్తుంది.

ఏ ఏ దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి?
ఆస్ట్రేలియా ఈ సాంకేతికతకు ఉపయోగించి తన కరెన్సీ నోట్లను పూర్తిగా పాలిమర్‌గా మార్చిన మొదటి దేశంగా నిలిచింది. అప్పటి నుంచి చాలా దేశాలు పాలిమర్ కరెన్సీని స్వీకరించాయి. కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, న్యూజిలాండ్, మెక్సికో, బ్రెజిల్, సౌదీ అరేబియా, రొమేనియా, బార్బడోస్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 2023 నాటికి సుమారు 45 దేశాలు పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాయి. వీటి వాడకం ఇంకా పెరుగుతూనే ఉంది.

ప్రస్తుత నోట్లు చెల్లుబాటు కాకుండా పోతాయా?
ఇప్పటివరకు ప్రకటించిన దానిలో ఏదీ ఆ విషయాన్ని సూచించడం లేదు. ప్రస్తుత చర్య కేవలం క్షేత్రస్థాయి ప్రయోగాల వైపే ఉంది. అది కూడా తక్కువ విలువ గల నోట్లతో మొదలవుతుంది. ఒకవేళ పాలిమర్ నోట్లను ప్రవేశపెడితే, భారత కరెన్సీలో గతంలో జరిగిన డిజైన్ మార్పుల మాదిరిగానే, ఈ పరివర్తన కాలంలో అవి ఇప్పటికే ఉన్న కాగితపు నోట్లతో పాటు చెలామణిలో ఉంటాయని భావిస్తున్నారు. ఈ చర్యలో భాగంగా ఆర్‌బీఐ పెద్ద నోట్ల రద్దుకు గానీ, కాగితపు నోట్లను తక్షణమే ఉపసంహరించుకోవడానికి గానీ ప్రణాళిక వేస్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+