క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్: 'ధురంధర్ 3'కి లైన్ క్లియర్?

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం.. అంతకుముందే జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారానే 75 కోట్ల రూపాయల రికార్డ్ కలెక్షన్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ చిత్రం క్లైమాక్స్‌లో చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు షాక్ ఇస్తోంది. సినిమా ప్రారంభం నుంచి 'బడే సాహబ్' ఎవరనే ఉత్కంఠకు తెరపడినప్పటికీ.. అసలు డ్రామా అంతా సినిమా చివరి 20 నిమిషాల్లోనే దాగి ఉంది. థియేటర్లలో ఈ సీన్లు వస్తున్నప్పుడు ప్రేక్షకులు సీట్ల నుంచి లేచి ఈలలు వేసేలా సినిమాను మలిచారు డైరెక్టర్ ఆదిత్య ధర్.

ఒళ్లు గగుర్పొడిచే పోరాట దృశ్యాలు
సినిమా క్లైమాక్స్‌లో హంజా(రణవీర్ సింగ్), మేజర్ ఇక్బాల్(అర్జున్ రాంపాల్)ని కలవడానికి మురీద్‌కే వెళ్తాడు. అక్కడ హంజా ఓ భారతీయ గూఢచారి అనే నిజం మేజర్ ఇక్బాల్‌కు తెలిసిపోతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగే రక్తపాతం, యాక్షన్ సీక్వెన్సులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. మేజర్ ఇక్బాల్‌ను హంజా మట్టికరిపిస్తాడు కానీ.. చివరకు పాకిస్థాన్ సైన్యానికి చిక్కుతాడు.

Dhurandhar 2 Climax Explained Shocking Twist of Indian Spy and Dhurandhar 3 Announcement

ఒళ్ళు గగుర్పొడిచే పోరాట దృశ్యాలు
సినిమా చివరిలో హంజా (రణవీర్ సింగ్), మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)ని కలవడానికి మురీద్‌కే వెళ్తాడు. అక్కడ హంజా ఒక భారతీయ గూఢచారి (Indian Spy) అనే నిజం మేజర్ ఇక్బాల్‌కు తెలిసిపోతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగే రక్తపాతం, యాక్షన్ సీక్వెన్స్‌లు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. మేజర్ ఇక్బాల్‌ను హంజా మట్టికరిపిస్తాడు కానీ, చివరకు పాకిస్థాన్ సైన్యానికి చిక్కుతాడు. హంజాను పాకిస్థాన్ సైన్యం చిత్రహింసలకు గురిచేస్తున్న సమయంలో, అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) చేసే ఓ మిస్టీరియస్ ఫోన్ కాల్ ద్వారా అతడికి విముక్తి లభిస్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది.

పాకిస్థాన్ రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న సీనియర్ నేత జమీల్ జమాలి (రాకేష్ బేడీ), నిజానికి పాకిస్థానీ కాదని, ఆయన ఒక భారతీయ గూఢచారి అని వెల్లడవుతుంది. హంజా భార్య యలీనా తండ్రి కూడా ఆయనే. శత్రువుల కళ్ల ముందే ఉంటూ ఇన్నేళ్లుగా భారత్ కోసం ఆయన చేస్తున్న పోరాటం చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

'ధురంధర్ 3'కి లైన్ క్లియర్?
హంజాను క్షేమంగా భారత్ పంపిస్తున్న సమయంలో జమీల్ జమాలి ఓ డైలాగ్ చెప్తాడు: "నువ్వు ఇంకా చాలా యుద్ధాలు చేయాల్సి ఉంది" అని అంటాడు. ఈ ఒక్క మాటతో 'ధురంధర్ 3' రాబోతుందనే విషయాన్ని చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమా చివరలో హంజా పంజాబ్‌లోని తన గ్రామానికి చేరుకుని కుటుంబాన్ని కలుస్తాడు. అయితే కథను ఓపెన్ ఎండింగ్‌గా వదిలేశారు. అతను ఓ సాధారణ వ్యక్తిగా ఉంటాడా లేదా మళ్లీ గూఢచారిగా మిషన్లలోకి వెళ్తాడా అనేది పార్ట్ 3లో చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+