ఆ హీరోతో సినిమా చేసిన తర్వాత ఆఫర్లే లేవు: శ్రుతిహాసన్ సంచలనం
శ్రుతిహాసన్ అనే పేరు గురించి దేశవ్యాప్తంగా పరిచయం అవసరంలేదు. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా పరిశ్రమలోకి అడుగుపెట్టి తనదైన నటనాశైలితో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. యువ కథానాయకుల దగ్గర నుంచి సీనియర్ హీరోలందరి సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో అయితే సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా దర్శకులకు మంచి ఆప్షన్ శ్రుతిహాసన్. కమల్ హాసన్ - సారిక దంపతుల కుమార్తె శ్రుతి. పరిశ్రమకు మొదటిసారిగా 'ఉన్నైపోల్ ఒరువన్' సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయమైంది.
పదేళ్ల తర్వాత సూపర్ హిట్ అయింది
తర్వాత మురుగదాస్ హీరోయిన్ గా అవకాశం ఇవ్వడంతో సూర్య సరసన సెవెంత్ సెన్స్ సినిమాలో నటించి మంచి నటనా ప్రతిభను కనపరిచింది. ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా అవకాశం వచ్చిన సినిమా 3. ధనుష్ కథానాయకుడిగా నటించగా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొలవెరి సాంగ్ సూపర్ హిట్ అయి రికార్డులు నెలకొల్పింది. సినిమా విడుదలైన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమాలో ధనుష్, శ్రుతి కెమిస్ట్రీ మాత్రం సినీ ప్రియులందరికీ బాగా నచ్చింది. చిత్రం ఏమిటంటే.. ఈ సినిమా పది సంవత్సరాల తర్వాత తిరిగి విడుదలైతే సూపర్ హిట్ అయింది.

కెరీర్ ను ప్రభావితం చేసిందో వివరించిన శ్రుతి హాసన్
ఈ సినిమా మొదటిసారి విడుదలైనప్పుడు హీరోయిన్ గా తన కెరీర్ ను ఎంతగా ప్రభావితం చేసిందో శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా విడుదలైన తర్వాత రెండు సంవత్సరాల వరకు ఏ సినిమాలోను, ఏ హీరో అవకాశం ఇవ్వలేదన్నారు. తెలుగు, తమిళం, కన్నడంతోపాటు హిందీలో కూడా నటిస్తున్నప్పటికీ తమిళంలో నటించడం మాత్రం ఆపనని శ్రుతి స్పష్టం చేశారు. ఇటీవలే ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటించారు. రవితేజ సరసన క్రాక్, చిరంజీవి సరసన వాల్తేర్ వీరయ్య, బాలయ్య సరసన వీరసింహారెడ్డి సినిమాలు చేశారు. నాగచైతన్య ప్రేమమ్ సినిమాద్వారా తెలగు తెరకు శ్రుతి పరిచయమైంది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమా చేస్తున్నారు. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకుడు.












Click it and Unblock the Notifications