ఆ ప్లే బాయ్ హీరోతో మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..?
సాయి పల్లవి... టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరో స్థాయిలో ఫిదా చేసిన సాయి పల్లవి.. ఆపై పలు పలువురు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసిన ఈ భామ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.
రీసెంట్ గానే శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలానే నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా ఆచితూచి అడుగులు వేసే ఈ భామ.. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి పచ్చజెండా ఊపుతారు. అలాంటి పాత్రల్లోనే నటిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు.

అయితే తాజాగా సాయి పల్లవి కోలీవుడ్ లో మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు భావిస్తున్నారు. అది కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందినప్పటికీ.. ప్లే బాయ్ గా ముద్ర వేసుకున్న శింబుతో ఆమె నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా శింబుతో మూవీ వద్దంటూ కామెంట్స్ చేస్తుంటే.. అసలు ఎందుకు ఓకే చేశారంటూ గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహరం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
శింబు ప్రస్తుతం కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'థగ్ లైఫ్' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల నటుడు శింబు పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ మూవీ రామ్‌కుమార్ దర్శకత్వంలో ఉంటుందని అనౌన్స్ చేశారు. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలోనే సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
శింబు నటించిన గత సినిమాల్లో ఎక్కువగా.. హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ ఉంటాయి. దీంతోనే సాయి పల్లవి ఆయనతో మూవీకి ఎందుకు ఓకే చేసిందా అని చర్చ జరుగుతోంది. శింబు గతంలో నయనతార, హన్సిక, ఆండ్రియా సహా పలువురు హీరోయిన్స్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలొచ్చాయి.












Click it and Unblock the Notifications