దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధ పడుతున్నారని తెలుస్తుంది. శ్యామ్ సుందర్ రెడ్డిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికి కూడా లాభం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మరణించారని వైద్యులు ప్రకటించారు.
ప్రస్తుతం ఆయన వయస్సు 86 ఏళ్లు. దిల్ రాజు తండ్రి మరణించారనే ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దిల్ రాజు స్వస్థలం నిజామాబాద్‌గా తెలుస్తుంది. శ్యాంసుందర్ రెడ్డి, ప్రమీల దంపతులకు మూడో కుమారుడే దిల్ రాజు. ఆయన అసలు పేరు వెంకటరమణారెడ్డి. ఇంట్లో వాళ్లు చిన్నతనం నుంచి ముద్దుగా రాజు అని పిలిచేవారు. అదే పేరుతో ఆయన ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.

సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన..ఇక్కడే స్థిరపడ్డారు. నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి సినిమా 'దిల్'. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో..దిల్ రాజు' ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఉదయం మహాప్రస్థానం'లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications