'గేమ్‌ ఛేంజర్‌' ఫ్లాప్‌ కు అసలు కారణం ఇదే.. ఎట్టకేలకు ఓపెన్ అయిన దిల్‌రాజు

కోలీవుడ్ దర్శకుడు శంకర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు అనగానే భారీ బడ్జెట్, అబ్బుర పరిచే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మంచి సామాజిక సందేశం కూడా మిలితమై ఉంటుంది. జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో ఇలాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చకున్నారు. అందుకే భారతీయ చిత్ర పరిశ్రమలోని దాదాపు అనేక మంది టాప్ హీరోలు ఒక్కసారైనా శంకర్ దర్శకత్వంలో చేయాలని ఉవ్విళ్లూరు తుంటారు. అయితే ఆ అవకాశం మాత్రం కొద్ది మందికే లభించింది.

అయితే శంకర్ ఇటీవలికాలంలో దర్శకత్వంలో కాస్త తడబడుతూ వస్తున్నారు. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన భారతీయుడు 2, రోబో 2, గేమ్ ఛేంజర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. నిజానికి గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించడమే.. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ కావడం, శంకర్ నేరుగా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. సంక్రాంతి కానుకగా 2025 లో విడుదలైన ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కానీ సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో కేవలం రూ. 180 కోట్ల వరకే రాబట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు కారణాలను తెలిపారు.

DilRaju Opens Up onGame Changer Failure The Actual Reason Behind the Flop Game Changer flop DilRaju

ఈ మూవీలోని పాటల కోసమే రూ. 75 కోట్లు ఖర్చు పెట్టాం.. కానీ మూవీలో కంటెంట్ లేనప్పుడు పాటలను ఎంత అద్భుతంగా తీసినా ఉపయోగం లేదు. గేమ్ ఛేంజర్ విషయంలో అదే జరిగింది. సినిమా షూటింగ్ కూడా చాలాకాలంపాటు జరిగింది. ఎన్నికల తర్వాత సినిమా రిలీజ్ కావడంతో అందులోని కంటెంట్ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయింది. కథలో కొత్తదనం లేక.. ఎక్కడో చూసిన ఫీలింగ్ ఏర్పడింది.. అని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+