కోర్టు బ్యూటీ "శ్రీదేవి" తమిళ్ మూవీ రిలీజ్‌కి రెడీ.. ఎప్పుడంటే ??
యువ నటి శ్రీదేవి.. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. 'కోర్ట్' సినిమాలో జాబిలి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అలానే 'కోర్ట్' తర్వాత హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్ల జంటగా నటించిన చిత్రం 'బ్యాండ్ మేళం'. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ.
కాగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. ఇప్పుడు తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందుతున్న 'హైకు' చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. డాక్టర్ అరుళనందు, మాథ్యో అరుళనందు నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోగా ఏగన్ నటిస్తుండగా, 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి మాట్లాడుతూ.. సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తి చేశాం. ఇది మా ఎంటైర్ టీమ్‌కు చాలా ఎమోషనల్, హ్యాపీ మూమెంట్. కథను నమ్మి నాకు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన మా నిర్మాతలు డా. డి. అరుళానందుకి, మాథేవో అరుళానందుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని తెలిపారు.
నిర్మాతలు డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు మాట్లాడుతూ, '''హైకూ' సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కథపై డైరెక్టర్‌కు ఉన్న స్పష్టత, మేకింగ్‌లో తను చూపిన నిజాయితీ, క్రమశిక్షణతో సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. సినిమాలోని ఎమోషన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి'' అన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశాలున్నాయి.
అంతే కాకుండా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. మేకింగ్ సమయంలోనే ఓటీటీ డీల్ కుదరడం అంటే సినిమా కథా బలం, యూనివర్సల్ ఎమోషనల్ అప్పీల్‌పై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. మరి తెలుగుతో పాటే తమిళంలో కూడా ఈ యంగ్ బ్యూటీ తొలి సినిమాతో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications