ఇంటెలిజెన్స్ అలర్ట్: మరోసారి ఉగ్ర కలకలం, దేవాలయాలే టార్గెట్
ప్రశాంతంగా ఉన్న భారతావనిపై ఉగ్ర చూపు పడిందా? మరీ ముఖ్యంగా దైవ భూమిపైనే దాడుకుల ప్లాన్ చేస్తున్నారా? దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి భారీ ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు ఒక్కసారిగా ప్రకంపనలు రేపాయి. ఖలీస్థానీ ఉగ్రవాదులు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరాఖండ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

టార్గెట్‌గా దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు..
ఈ దాడులకు సంబంధించి ఒక ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లోని ప్రధాన దేవాలయాలతో పాటు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, పోలీసు వ్యవస్థలను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నట్లు ఆ ఈ-మెయిల్ సమాచారం ఇస్తోంది. ఈ మెయిల్ నిజానిజాలను నిర్ధారించేందుకు, దాని మూలాలను కనుగొనేందుకు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పెరిగిన భద్రత..
తాజా హెచ్చరికలతో ఢిల్లీ, ఉత్తరాఖండ్ పోలీసులు, నిఘా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా సెన్సిటివ్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, కట్టుదిట్టం చేస్తున్నారు. నిఘా సంస్థలు గతంలో కూడా ఇదే తరహా హెచ్చరికలు జారీ చేశాయి.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిషేధిత ఖలీస్థానీ గ్రూపులు, బంగ్లాదేశ్ ఆధారిత ఉగ్రవాద సంస్థల నుండి దాడుల ముప్పు ఉందని హెచ్చరించగా, ఫిబ్రవరి నెలలో ఎర్రకోట సమీపంలో, చాందినీ చౌక్ ప్రాంతంలోని దేవాలయాలపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఎర్రకోట, చాందినీ చౌక్ వంటి కీలక మతపరమైన ప్రదేశాలు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ రాడార్‌లో ఉన్నాయని నిఘా వర్గాలు గతంలోనే పేర్కొన్నాయి.














Click it and Unblock the Notifications