'ఎగ్ పెప్పర్ ఫ్రై'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అదుర్స్ గురూ..!
గుడ్డు సంపూర్ణ ఆహారం. కోడి గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే రోజుకో గుడ్డు తినాలని వైద్యులు చెబుతున్నారు. గుడ్డుతో చాలా రకాల కర్రీలను తయారు చేస్తుంటారు. కొందరు ఉడికిస్తుండగా మరికొందరు ఫ్రై చేస్తుంటారు. ఎలా చేసుకున్నా గుడ్డు కర్రీ టేస్టీగానే ఉంటుంది. మరి గుడ్డుతో పెప్పర్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా..? ఎగ్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఎగ్ పెప్పర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే గుడ్లు నాలుగు, నూనె రెండు టేబుల్ స్పూన్ లు, ఉల్లిపాయలు ఒక కప్పు, పచ్చిమిర్చి మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు కొన్ని, ఉప్పు తగినంత, పసుపు పావు టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా అర టేబుల్ స్పూన్, నల్ల మిరియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఘాటు కోసం, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి.

ఇప్పుడు తయారీ విధానం చూస్తే ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమానికి మసాలాలు కలపాలి. ఆ మసాలాలు మగ్గిన తర్వాత అందులో ఉడికించిన గుడ్లు, నల్ల మిరియాల పొడి వేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అయినట్టే.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి..












Click it and Unblock the Notifications