BRS కు కేసీఆర్ సన్నిహిత నేత గుడ్ బై - బీజేపీ గేమ్ షురూ..!?

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ గ్రేటర్ లో తిరిగి సత్తా కొన సాగించాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ గ్రేటర్ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలు పెట్టింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతల పైన బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. బీజేపీ ఇతర పార్టీల నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. త్వరలో గ్రేటర్ ఎన్నికల దిశగా రాజకీయ వ్యూహాలను పార్టీ లు అమలు చేస్తున్నాయి. ఈ సమయంలోనే గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతల పైన బీజేపీ గురి పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి.. కేసీఆర్ సన్నిహిత నేత మల్లారెడ్డి పార్టీ వీడటానికి సిద్దం అయినట్లు గులాబీ నేతల్లో ప్రచారం సాగుతోంది. ఆయన కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఘట్‌కేసర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సభకు హాజరు కావడంతో పాటుగా అదే వేదిక నుంచి రేవంత్‌ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నా స్పందించకపోవటం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆ తరువాత కూడా రేవంత్‌ విమర్శలను మల్లారెడ్డి ఖండించలేదు. దీంతో.. నేరుగా మల్లారెడ్డిని గులాబీ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు.

brs-senior-leader-mallareddy-likely-to-leave-the-party-chances-for-joining-in-bjp-as-reports

గ్రేటర్ ఎన్నికల వేళ మారుతున్న రాజకీయం

ఇదే సమయంలో మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ డిమాండ్‌ చేస్తోంది. మల్లారెడ్డి ఎందుకు స్పందించటం లేదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే మల్లారెడ్డిపై మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉండడంతోపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా హాజరు కావడంలేదు. కొంత కాలం క్రితం మల్లారెడ్డి గతంతో తన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలిసారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు బీజేపీ ముఖ్య నేతలతో మల్లారెడ్డి సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. గతంలో ఆయన ప్రస్తుత కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌నూ కలిశారు. గ్రేటర్ ఎన్నికల నాటికి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతానే ప్రచారం సాగుతున్నా.. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం బీజేపీ వైపు ఆసక్తిగా ఉన్నారని.. ఇప్పటికే సానుకూల సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. దీంతో.. అసలు మల్లారెడ్డి బీఆర్ఎస్ వీడుతున్నారా.. ఏ పార్టీలో చేరుతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+