జగజ్జేత..: అర్జెంటీనా కొంప మునిగిందక్కడే: మెస్సీ సైతం.. !!

ఫిఫా వరల్డ్ కప్ విజేతపై మెజారిటీ అంచనాలు, జోస్యాలు తలకిందులు అయ్యాయి. నిరుటి విజేత అర్జెంటీనా.. తన ఛాంపియన్ షిప్ ను నిలబెట్టుకుంటుందని ఆశించిన సగటు ఫుట్‌బాల్ అభిమానికి నిరాశే మిగిలింది. అర్జెంటీనా ఓడింది. స్పెయిన్ గేమ్ ప్లాన్ ముందు తలవంచింది. ఆ జట్టు డిఫెన్స్ ను ఛేదించలేకపోయింది. అటు స్పెయిన్ గోల్ కీపర్ అడ్డుగోడగా మారడం కూడా అర్జెంటీనా ఓటమికి ప్రధాన కారణం. పదే పదే దాడులు చేసినా అవేవీ కూడా ఫలించలేదు. 0-1 తేడాతో ఓటమిని తప్పించుకోలేకపోయింది.

న్యూజెర్సీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాపై స్పెయిన్ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయానికి ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్ కు దారితీసింది. ఆ సమయంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెరాన్ టోర్రెస్ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు 1-0 తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తన జట్టును విశ్వవిజేతగా నిలిపాడు.

Spain Outlasts Argentina 1-0 in as Ferran Torres Shines at 106th Minute to Secure 2nd FIFA World Cup

మ్యాచ్ ఆరంభం నుంచే స్పెయిన్ తన వ్యూహాత్మక ఆటతీరుతో మైదానంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బంతిని అత్యధిక సమయం అంటే..68 శాతం తన స్వాధీనంలో ఉంచుకోగలిగిందంటే.. స్పెయిన్ ఎంత పకడ్బందీగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఇది.. అర్జెంటీనాను ఒత్తిడిలోకి నెట్టింది. అర్జెంటీనాను రౌండప్ చేస్తూనే స్పెయిన్ ఆటగాళ్లు వరుస దాడులతో ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. మ్యాచ్ మొత్తంలో స్పెయిన్ ఏకంగా 20 సార్లు గోల్ కోసం ప్రయత్నించగా.. అందులో 11 షాట్లు నేరుగా టార్గెట్‌ను తాకడం వారి దూకుడుకు అద్దం పట్టింది.

మరోవంక.. అర్జెంటీనా ఆటతీరు ఈ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో సాగలేదు. ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇచ్చింది. తన సహజ శైలి ఆటను మరిచిపోయినట్టనిపించింది. అటాకింగ్ కొరవడింది. సరైన సమయంలో కౌంటర్ అటాక్ కూడా చేయలేకపోయింది. మ్యాచ్ మొత్తంలో అర్జెంటీనా మూడు షాట్లు మాత్రమే కొట్టడం దీనికి నిదర్శనం. అందులో ఒక్కటి కూడా గోల్ వైపు వెళ్లకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ లో 32 శాతం వరకు మాత్రమే బంతిని తన ఆధీనంలో ఉంచుకోగలిగింది. స్పెయిన్‌ను అడ్డుకునే క్రమంలో ఫౌల్స్‌పై ఎక్కువగా ఆధారపడాల్సొచ్చింది.

అర్జెంటీనా ఆటగాళ్లు దూకుడుగా ఆడటానికి ప్రయత్నించిన ప్రతీసారీ ఫౌల్స్ రికార్డయ్యాయి. స్పెయిన్ దాడులను తిప్పికొట్టే క్రమంలో ఏకంగా 24 ఫౌల్స్ చేశారు. ఈ క్రమంలో అయిదు ఎల్లో కార్డ్స్ లభించాయా జట్టుకు. నికోలస్ ఒటామెండి, లిసాండ్రో మార్టినెజ్, లియాండ్రో పరేడెస్ వంటి డిఫెండర్లు ప్రత్యర్థిని అడ్డుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ.. నిలకడగా ఆడిన స్పెయిన్ ఆటగాళ్లు ఎలాంటి కార్డులు లేకుండా క్లీన్ రికార్డుతో మ్యాచ్‌ను ముగించారు.

మ్యాచ్ 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఫలితంగా.. మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది. ఎప్పుడేం జరుగుతుందో అంతుబట్టని స్థితి.. అక్కడ కూడా. అభిమానులను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టింది. 106వ నిమిషంలో స్పెయిన్ వింగర్ నికో విలియమ్స్ అందించిన అద్భుత పాస్‌ను ఫెరాన్ టోర్రెస్ గోల్‌గా మలిచాడు. ఈ ఏకైక గోల్‌తో స్పెయిన్ విజయం ఖాయమైంది.

ఈ విజయంతో స్పెయిన్ జగజ్జేతగా నిలిచింది. తన వ్యూహాత్మక బలాన్ని మరోసారి ఫుట్ బాల్ లోకానికి చాటింది. అర్జెంటీనా డిఫెన్స్ చివరి వరకు పోరాడినప్పటికీ.. అటాకింగ్‌లో వైఫల్యం వెంటాడింది. ఓటమిని మిగిల్చింది. మ్యాచ్ అనంతరం లియోనెల్ మెస్సీ.. కన్నీరు పెట్టుకున్నాడు. నిరాశలో కూరుకుపోయాడు. విషణ్ణ వదనంతో మోకాళ్లపై కూర్చుని కనిపించాడు. ఇది.. ఫ్యాన్స్ ను కలచివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+