నిరాహార దీక్ష విరమిస్తా గానీ.. వీటికి ఒప్పుకొంటేనే: కేంద్రం ముందు సోనమ్ వాంగ్‌చుక్ షరతులు

లడఖ్‌కు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరసన దీక్షను ముగించేందుకు సిద్ధం అయ్యారు. దీనికోసం ఆయన కేంద్ర ప్రభుత్వం ముందు మూడు షరతులను ఉంచారు. వీటికి అంగీకరిస్తే తక్షణమే ఆమరణ నిరాహార దీక్షకు స్వస్తి పలుకుతానని, ఇందులో తనకు ఎటువంటి భేషజాలూ లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ తెల్లవారు జామున ఓ లేఖను ఆయన విడుదల చేశారు. దీన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఢిల్లీ సఫ్దార్‌జంగ్ ఆసుపత్రిలో సోనమ్ వాంగ్‌చుక్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తన షరతులను అంగీకరిస్తే తక్షణమే దీక్షను విరమిస్తానని పేర్కొన్నారు. ఇందులో మొదటిది.. దేశంలోని విద్యా రంగ పరిణామాలకు సంబంధించింది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీల వ్యవహారాలు, విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన కేంద్రానికి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

Sonam Wangchuk released a Latest letter from Hospital and says He ll Break His Fast If These Conditions Are Met

రెండో షరతు.. తాను, మరికొందరు ప్రతినిధులతో కలిసి పార్లమెంట్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అక్కడ వివిధ రాజకీయ పార్టీ సభ్యులు తమను కలుస్తానని, విద్యా వ్యవస్థ లోపాలు, ఇతర సామాజిక సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు. దీని ద్వారా పాలకులతో పాటు కోట్లాదిమంది దేశ ప్రజల దృష్టికి సమస్యను చేరవేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మూడో షరతు.. ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల గానీ, ఇతర భద్రతా కారణాల వల్ల గానీ తాను పార్లమెంట్‌కు వెళ్లడం సాధ్యం కాకపోతే, వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు, ఎంపీలు నేరుగా సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి రావాలని, దీనికి అనుమతి ఇవ్వాలని సోనమ్ వాంగ్ చుక్ ప్రతిపాదించారు. ఆసుపత్రిలోనే తనను కలిసి, వివాదాస్పద అంశాలపై ఖచ్చితమైన హామీ ఇస్తేనే నిరసన ముగిస్తానని ఆయన తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. తన ఆరోగ్య పరిస్థితి కంటే కూడా సమాజ ప్రయోజనాలే ముఖ్యమని, లడఖ్ ప్రజల హక్కులు, విద్యా రంగ భద్రత కోసం తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. పార్లమెంట్ మార్చ్ విజయవంతం అయ్యేంత వరకు తన దీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+