స్టాలిన్ కు బిగ్ షాక్, కీలక 'మిత్రుడు' గుడ్ బై - విజయ్ మార్క్ గేమ్..!!
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ సీఎం అయిన తరువాత అటు డీఎంకే.. ఇటు అన్నాడీఎంకే పైన గురి పెట్టారు. రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అన్నా డీఎంకే నుంచి ఎమ్మెల్యేలను.. డీఎంకే నుంచి మిత్రపక్షాలను తన వైపు తిప్పుకుంటున్నారు. అందులో భాగంగా డీఎంకే కు కీలక భాగస్వామ్య పక్షం తాజాగా గుడ్ బై చెప్పింది. విజయ్ వైపు అడుగులు వేస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. రాష్ట్రంతో త్వరలో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ముందే డీఎంకే, అన్నా డీఎంకే లక్ష్యంగా విజయ్ తన రాజకీయ వ్యూహాలను వేగంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా అంచనా వేస్తున్నట్లుగా నేMDMK పార్టీ DMKతో గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తున్న పొత్తును అధికారికంగా ముగించింది. ఆమోదించిన తీర్మానాల్లో, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని స్వాగతించిన MDMK, కీలక ఎన్నికల హామీల విషయంలో రాజీపడకుండా వ్యవహరించాలని కోరింది. ముఖ్యంగా అవినీతి రహిత పాలనను అందించడం మరియు మెకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్ వంటి అంశాలపై తమిళనాడు హక్కులను పరిరక్షించడం వంటి వాటిపై ప్రభుత్వం దృఢంగా ఉండాలని సూచించింది.

టీవీకే కూటమిలో చేరిక ఇక లాంఛనమేనా..!
దీని ద్వారా ఎండీఎంకే ఇక టీవీకే కూటమికి దగ్గరవ్వటం లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. డీఎంకే కూటమిలో ఉన్న సమయంలో MDMKని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించింది. ఈ పరిస్థితుల వల్ల కూటమిలో కొనసాగడం అసాధ్యమని పేర్కొంది. ఈ పరిణామం డీఎంకేకు ఒక ఎదురుదెబ్బ అయినప్పటికీ, అదే సమయంలో ఎండీఎంకేకు కూడా ఇది ఒక దెబ్బగానే పరిణమించింది. 2026 ఎన్నికల్లో ఎండీఎంకే నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీవీకే ప్రభుత్వం ఎదుర్కొన్న విశ్వాస పరీక్ష సమయంలో ఎండీఎంకే ఓటింగ్‌కు దూరంగా ఉన్నప్పుడే ఆ పార్టీ ఈ తరహా నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. విజయ్ తో ఎండీఎంకే అధినేత వైకో సమావేశం లో అన్ని అంశాల పైన చర్చించారు. ఇక, ఇప్పుడు పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.













Click it and Unblock the Notifications