అయోధ్యలో చోరీ సాధారణ నేరమే..! తేల్చేసిన సుప్రీంకోర్టు..!
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్మించిన రామాలయం (Ayodhya Ram temple)లో తాజాగా చోటు చేసుకున్న కోట్లాది రూపాయల విరాళాల చోరీ వ్యవహారం దేశంలో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇరుకునపడ్డాయి. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తున్నాయి. అదే సమయంలో రామాలయ ట్రస్టు ఛైర్మన్ చంపత్ రాయ్ తో పాటు మరికొందరు సభ్యులు కూడా రాజీనామాలు సమర్పించారు. వారి అనుచరులే ఈ చోరీలో కీలక నిందితులుగా ఉండటమే ఇందుకు కారణం.
అయితే ఈ కేసులో వస్తున్న ఆరోపణల తీవ్రత నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) మాత్రం ఈ చోరీ ఘటనను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామ్ మందిరం విరాళాల దొంగతనం కేసును రాజకీయ రంగు పులమొద్దని సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టం చేసింది. ఇది సాధారణ నేరానికి సంబంధించిన కేసు మాత్రమేనని, దీనిని రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని వ్యాఖ్యానించింది. కోర్టు బాధ్యత కేసులో నిష్పాక్షికంగా, సమర్థవంతంగా దర్యాప్తు జరిగేలా చూడటమేనని తేల్చిచెప్పింది.

ఈ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తోందని, ఇప్పటికే స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించినట్లు తెలిపింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో యూపీ సర్కార్ ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందంలో మార్పులు చేయాలంటూ యోగీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది. రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, విచారణను రాజకీయ వేదికగా ఉపయోగించకుండా చట్టపరమైన కోణంలోనే చూడాలని సుప్రీంకోర్టు సూచించింది. దర్యాప్తు పూర్తయ్యాక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అప్పటివరకు అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు సూచించింది.












Click it and Unblock the Notifications