రిమ్స్‌ విషాదంలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రేవంత్ సర్కార్!

ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన పిల్లల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.

ఆదిలాబాద్‌లోని వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే పిల్లలను హైదరాబాద్‌లోని పెద్ద హాస్పిటల్స్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రిమ్స్‌లో 150 బెడ్ల మాతా శిశు ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. అత్యాధునిక వసతులతో ఎంసీహెచ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

Adilabad RIMS fire accident Five children dead Telangana government announces Rs 5 lakh ex-gratia to each family

కాగా ఆదిలాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనతో నిన్న రిమ్స్ సందర్శించిన మంత్రి అగ్నిప్రమాదం జరిగిన నవజాత శిశు వార్డును పరిశీలించారు. ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ప్రస్తుత వైద్య పరిస్థితి, చికిత్స అందుతున్న విధానం, తీసుకున్న తక్షణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రిమ్స్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, రిమ్స్‌ వైద్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ,రిమ్స్‌లోని నవజాత శిశు వార్డులో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ప్రాథమిక విచారణలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు.

అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.
ప్రమాదం జరిగిన వెంటనే రిమ్స్‌ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక, పోలీసు శాఖలు సమన్వయంతో స్పందించి, చికిత్స పొందుతున్న నవజాత శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి, ప్రభావిత చిన్నారులకు అత్యవసర వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో నవజాత శిశువులు మృతి చెందడం బాధాకరమని మంత్రి తెలిపారు. ప్రభావిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రుల సహకారాన్ని కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.

యూట్యూబర్ వైష్ణవి నుండి హరిబాబు హత్యదాకా.. రీల్స్ క్రైం కథాచిత్రం... సొసైటీకి పెను ప్రమాదం!
యూట్యూబర్ వైష్ణవి నుండి హరిబాబు హత్యదాకా.. రీల్స్ క్రైం కథాచిత్రం... సొసైటీకి పెను ప్రమాదం!

అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా లోపాలు, నిర్వహణలో లోపాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. రిమ్స్‌లో మూడు కీలక సేఫ్టీ ఆడిట్‌లను నిర్వహించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం బయటపడినా, నిబంధనల ప్రకారం తగిన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+