శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు విద్యార్థులు మృతి

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావి వలస సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పై‌ నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను ఎదురుగా వచ్చిన రాజ్య రాణి ఎక్స్‌ ప్రెస్‌ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థి ప్రస్తుతం టెక్కలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులంతా టెక్కలిలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ హాస్టల్ లో ఇంటర్ చదువుతున్నారు. అయితే ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వరద నీటిలో సరదాగా చేపలు పట్టేందుకు ఐదుగురు విద్యార్థులు వెళ్లారు. అయితే మార్గమధ్యలో రైల్వే లైన్ ను క్రాసింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న రైలును గుర్తించలేదు. దాంతో రైలు విద్యార్థుల పైనుంచి వెళ్లిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. రైల్వే భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

మృతులను విశాఖ రావు, దిలీప్, శరత్, శివ గా గుర్తించారు. వీరంతా టెక్కలి మండలంలోని దామరు గ్రామానికి చెందినవారుగా తేల్చారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు ఒకేసారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక గాయపడిన విద్యార్థి సాల్మాన్ రాజుగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Srikakulam district Tragedy Four students killed after being hit by a train Srikakulam accident

చేతికందివచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతమని, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థి సాల్మన్‌ రాజ్‌ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అతను త్వరగా కోలుకోవాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+