మెగా ఫ్యామిలీ ఎఫెక్ట్..అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పుకున్న స్టార్ దర్శకుడు..?
కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కాదని వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇక ఈ ఎన్నికల్లో జనసేన విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. దీంతో మెగా అభిమానులు అల్లు అర్జున్‌ను టార్గెట్‌గా పెట్టుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.దీంతో మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను డిసెంబర్‌కు వాయిదా వేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే పవన్‌కు బయపడే సినిమాను వాయిదా వేసుకున్నారని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో సమంతకు హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.
అయితే సడన్‌గా ఈ సినిమా అట్లీ తప్పుకున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో తీయాల్సిన సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో తెరకెక్కించడానికి అట్లీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే అట్లీ అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పుకోవడం వెనుక మెగా ఫ్యామిలీ హస్తం ఉందనే అనుమానం ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అట్లీతో సినిమా క్యాన్సిల్ కావడంపై అల్లు అర్జున్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పుష్ప-2 సినిమా ఓ కొలిక్కి వస్తే కానీ అట్లీ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications