పవన్ కల్యాణ్ దెబ్బ పుష్ప-2కు తప్పదు..దర్శకుడు షాకింగ్ కామెంట్స్
మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడమే దీనికి కారణం.మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు.

ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. కిర్రాక్ ఆర్పీ వంటి ఆర్టిస్టులు నేరుగానే అల్లు అర్జున్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు.ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
పవన్ కల్యాణ్‌తో వైరం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాపై పడుందని దర్శకుడు గీతాకృష్ణ. ఆయన మాట్లాడుతూ.. అల్లు అరవింద్ పద్ధతులు పవన్ కళ్యాణ్‌కి నచ్చవు. తన తండ్రితో పవన్ కళ్యాణ్ వ్యవహరించే తీరును అల్లు అర్జున్ మనసులో పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్‌తో వివాదం అల్లు అర్జున్ సినిమా పుష్ప-2 పై పడుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతాడని అల్లు అర్జున్ ఊహించలేదు. అల్లు అర్జున్ ఇప్పటికైనా మెగా ఫ్యామిలీతో సంధి చేసుకుంటే మంచిదని దర్శకుడు గీతాకృష్ణ హితబోధ చేశారు












Click it and Unblock the Notifications