‘స్పిరిట్’ కలెక్షన్లు ఎంత వస్తాయో ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా

సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో 'స్పిరిట్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ప్రభాస్ ను సందీప్ ఎలా చూపిస్తాడా? అనే ఉత్కంఠ డార్లింగ్ అభిమానుల్లోనేకాదు.. మొత్తం సినీ ప్రియుల్లోనే నెలకొంది. కొరియాకు చెందిన విలన్ డాన్ లీని రంగంలోకి దింపుతున్నాడు. రెండు భీకర విగ్రహాలు హోరాహోరీగా కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలంటే 'స్పిరిట్' చూస్తే సరిపోతుందని యాక్షన్ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

దంగల్ సినిమాకు చైనాలో వచ్చాయి
తాజాగా సందీప్ రెడ్డి వంగా సంచలన ప్రకటన చేశారు. 'స్పిరిట్' చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే, విడుదలైన తర్వాత రూ.2500 కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు. దీంతో ఈ సినిమా కథపై ఆయనకు ఎంత ఆత్మవిశ్వాసం ఉందో అర్థమవుతోంది. సందీప్ ప్రకటనతో డార్లింగ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటివరకు దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి నిలిచింది. దీని తర్వాత పుష్ప అంటున్నారు కానీ అవి వాస్తవ కలెక్షన్లా? లేదంటే నిజమా? అనే దాంట్లో స్పష్టత లేదు. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా 2వేల కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఇండియాలో కేవలం 800 కోట్లు మాత్రమే రాబట్టిందికానీ చైనాలో విడుదల చేస్తే 1200 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది.

director Sandeep Reddy Vanga announces the collections of Spirit

వారణాసి కంటే ముందా? వెనకా?
దేశవ్యాప్తంగా చూసుకుంటే బాహుబలి, మొత్తం సినిమాల పరంగా చూసుకుంటే దంగల్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలుగా నిలుస్తాయి. ఇప్పుడు స్పిరిట్ చిత్రం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలవబోతోందని సందీప్ వంగా ప్రకటించేశాడు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా ఎంత సాధిస్తుందనేది చూడాలి. ఆ సినిమాకు ముందు విదుదలవుతుందా? లేదంటే తర్వాత స్పిరిట్ విడుదలవుతుందా? అనే స్పష్టత లేదు. అయితే వారణాసి కోసం రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్నాడు. మొత్తం మీద ఈ సినిమా 10వేల కోట్ల కలెక్షన్లు రాబట్టాలనేది టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. చూడాలి స్పిరిట్, వారణాసి ఎంత కలెక్షన్లు రాబడతాయనేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+