సీఎం విజయ్ బర్త్ డే గిఫ్ట్.. తమిళనాడు ప్రజలకు బంపరాఫర్
తమిళనాడు సీఎం విజయ్ బర్త్ డే కానుకగా రాష్ట్రంలోని ప్రజలకు టీవీకే ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. తమిళనాడులోని జూపార్క్ లకు ఫ్రీ ఎంట్రీకి ఆదేశించింది. జూన్ 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని ప్రజలు ఈ జూపార్క్ లను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తూ ఈ మేరకు తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఆర్వీ రంజిత్ కుమార్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. వందలూర్ లోని అరిగ్ నార్ అన్నా జూలాజికల్ పార్క్, వెల్లూర్ లోని అమిర్తి జూలాజికల్ పార్క్, సాలెంలోని కురుంబపట్టి జూలాజికల్ పార్క్ లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సందర్శకులు ఫ్రీ ఎంట్రీ కోసం ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇక్కడి ఏర్పాట్లను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు రోజుల్లో సందర్శకులకు సంబంధించిన మొత్తం టికెట్ ధరలు తమ ఫ్యామిలీ ట్రస్ట్ భరిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు వ్యయం రూ. కోటి వరకు ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు ఇలా ఉచిత ప్రవేశం కారణంగా రద్దీ భారీ గా పెరిగే అవకాశం ఉందని జూ అధికారులు, పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సాధారణంగానే వందలూర్ జూపార్క్ కు సందర్శకులు భారీగా తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో అయితే 15 వేల మంది అలాగే పొంగల్ సెలవు దినాల్లో అయితే రోజుకు 60 వేల మందికి పైగా విజిటర్స్ వస్తుంటారు. అయితే తాజాగా తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తీసుకున్న నిర్ణయంతో సందర్శకుల సంఖ్య భారీగా పెరగనుంది. రోజుకు లక్ష మంది సందర్శకులు దాటితే జూలో భద్రతా సమస్యలు, జంతువుల సంరక్షణ ఇబ్బంది కరంగా ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరోవైపు సీఎం విజయ్ జూన్ 22న 52వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు ఫ్యాన్స్ , టీవీకే కార్యకర్తలు సిద్ధం అవుతున్నారు. తమిళనాడు సీఎం అయిన తర్వాత జరుపుకుంటున్న తొలి బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అటు ఆయన కెరీర్ లో మైలు రాళ్లుగా నిల్చిన సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, కేక్ కట్టింగ్స్, సంబరాలకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications