రామ్‌చరణ్ తర్వాత శంకర్‌కు బలి కాబోతున్న స్టార్ హీరో అతనే?
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందించిన గేమ్ ఛేంజర్ విడుదలైంది. కాలం చెల్లిన కథ, కథనాలతో ఆకట్టుకోలేకపోయాడు. స్నేహితుడు, రోబో2, ఐ, భారతీయుడు2 తర్వాత మరో అట్టర్ ఫ్లాప్ మూవీని ప్రేక్షకులకు అందించాడు. తనను తాను మార్చుకోకుండా తాను అనుకున్నట్లుగానే సినిమాలు రూపొందిస్తూ, వృథాగా నిర్మాతలచేత డబ్బులు ఖర్చు చేయించడం శంకర్ అలవాటు. రూ.15 కోట్లు ఖర్చుపెట్టి తీసిన నానా హైరానా పాటను సినిమాలో పెట్టలేదు. గేమ్ ఛేంజర్ లో అన్నీ వృథా ఖర్చులే కనిపించాయికానీ అవసరమైనచోట పెట్టిన ఖర్చులు మాత్రం కనపడలేదు. తమకు కూడా ఒకే ఒక్కడు, భారతీయుడు, జంటిల్ మెన్, రోబో లాంటి సినిమాలను అందించకపోతాడా? అనే ఆశతో నిర్మాతలు అడిగినంత ఖర్చు పెట్టడానికి ఒప్పుకుంటున్నారు.
ఎంతోమంది తమ గౌరవాన్ని కాపాడుకుంటున్నారు
తమిళంలో ఎవరూ దొరక్కపోవడంతో తెలుగులో చిరంజీవితో అనుకున్నాడుకానీ చివరకు రామ్ చరణ్, దిల్ రాజు దొరికి బలైపోయారు. భారీ నష్టాల్లో దిల్ రాజు కూరుకుపోయే అవకాశం ఉందంటున్నారు. తర్వాత ఏ హీరో కూడా శంకర్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు కనపడటంలేదు. భారతీయుడు2 తీసే సమయంలోనే భారతీయుడు3 కూడా దాదాపుగా పూర్తిచేశాడు. త్వరలో దాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటి తరానికి అనుగుణంగా, వాస్తవికత ఉట్టిపడేలా సినిమాలు తీయడం కష్టమవుతుందనే ఉద్దేశంతో ఎంతోమంది సీనియర్ దర్శకుడు సినిమాలు చేయకుండా తమ గౌరవాన్ని కాపాడుకుంటున్నారు. కానీ శంకర్ మాత్రం నిర్మాతలచేట కోట్లరూపాయలు ఖర్చుపెట్టిస్తున్నారు.

తెలుగులో హీరోలు ఖాళీగా లేరు
తెలుగులో తనకు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తో సినిమాలు చేయాలనుందని గతంలో కూడా శంకర్ చెప్పారు. కానీ మహేష్ బాబు నాలుగైదు సంవత్సరాల వరకు దొరకడు. దొరికినా శంకర్ కు సినిమా చేయడు. ప్రభాస్ కు అసలు ఖాళీలేదు. ప్రతి ఆరు నెలలకు అతను సినిమా విడుదల చేసే ప్రణాళికలో ఉన్నాడు. తర్వాత చిరంజీవి యువ దర్శకులతోనే సినిమాలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. రజనీకాంత్ బయోపిక్ తీస్తానని, అందులో ధనుష్ నటిస్తాడని శంకర్ చెప్పాడు. ధనుష్ ఒప్పుకున్నాడా? లేదా? అనేది తెలియదు. ఒప్పుకుంటే ధనుష్ స్క్రిప్ట్ విషయంలో ఏం చేస్తాడో చూడాలి. తర్వాత శంకర్ కు బలవబోయేది ధనుష్ కావొచ్చంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications