రకుల్ ప్రీత్ సింగ్ దంపతుల ఆస్తులు ఎన్ని రూ.వందల కోట్లో తెలుసా?
తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో పడి తాజాగా వివాహం చేసుకుంది. ఈనెల 21న గోవాలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ తర్వాత వరుసగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ లాంటి సినిమాల్లో నటించి హిట్ లను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో చివరగా కొండపొలం సినిమాలో నటించింది.
రకుల్ ఆస్తుల విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు జిమ్స్ ఉన్నాయి. కోటి రూపాయల మెర్సిడెజ్ బెంజ్, రూ.70 లక్షల రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు, రూ.75 లక్షల బీఎండబ్ల్యూ 520డీ కారు, 35 లక్షల ఆడీ Q3 కారు, 2.96 కోట్ల మెర్సిడెజ్ మెబాజ్ జీఎల్ఎస్600 కారు, హైదరాబాద్ లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంది. మొత్తం రూ.50 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ముంబయిలో ఒక విలాసవంతమైన ఫ్లాట్ కలిగివుంది.

రకుల్ భర్త జాకీ భగ్నాని ఆస్తుల నికర విలువ దాదాపు రూ. 41 కోట్లుగా ఉంది. ముంబయిలోని బాంద్రాలో 6వేల చదరపు అడుగుల ఇల్లు ఉంది. లంబోర్ఘిని గల్లార్డో, పోర్స్చే కయెన్నే టర్బో, పోర్స్చే పనామెరా, రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ మేబ్యాక్ S500 మరియు మెర్సిడెస్-బెంజ్ CLS వంటి విలాసవంతమైన కార్లున్నాయి. జాకీ భగ్నానీ బాలీవుడ్ కు చెందిన వాషు భగ్నానీ కుమారుడు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రస్తుత అధిపతి. 1995లో దీన్ని స్థాపించారు. దీప్‌శిఖా దేశ్‌ముఖ్‌తో కలిసి వాషు భగ్నానీ జాకీ 'సర్బ్‌జిత్', 'పర్మాను: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్', జవానీ జానేమాన్', 'కూలీ నంబర్ 1', 'బెల్ బాటమ్' లాంటి సినిమాలను నిర్మించారు.












Click it and Unblock the Notifications