రొమాన్స్‌తో మొదలై.. సైన్స్ ఫిక్షన్‌తో షాక్ ఇవ్వనున్న సినిమా!
హైదరాబాద్ కేంద్రంగాప్రముఖ నిర్మాణ సంస్థ డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ తన తొలి సినిమా (ప్రొడక్షన్ నంబర్ 1)ను విజయవంతంగా ప్రారంభించింది. దసరా పర్వదిన శుభముహూర్తాన చిత్ర బృందం, ఆత్మీయుల సమక్షంలో పూజా కార్యాక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాతో శశాంక్ దువ్వూరు దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల కీలక పాత్రల్లో నటిస్తుండగా.. నేహా పఠాన్ కథానాయికగా అలరించనున్నారు.
వైద్య వృత్తి నుంచి సినీ నిర్మాణంలోకి..
ఈ సినిమాను ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్(ఐఏఎంఏ) వ్యవస్థాపకులు, సీఈవో డాక్టర్ దామోదర్ నేరేళ్ల తన డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు. గత 26 ఏళ్లుగా యూకే, అమెరికాల్లో వైద్యుడిగా సేవలు అందిస్తున్న ఆయన.. మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తుంటారు. చిన్నతనం నుంచే సినిమాలపై ఉన్న మక్కువతో మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ' సినిమా చూసేందుకు పాఠశాలకు ఎగ్గొట్టి వరంగల్ వెళ్లిన జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. శశాంక్ చెప్పిన స్టోరీలోని ప్రేమ, స్నేహం, కుటుంబ విలువలు, సందేశం నచ్చడంతో ఈ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

వినోదంతో పాటు సూపర్ కాన్సెప్ట్
డైరెక్టర్ శశాంక్ దువ్వూరు గతంలో రష్మిక మందన్న నటించిన సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. అలానే 'ఉల్టా' అనే షార్ట్ ఫిల్మ్‌కి దర్శకుడిగా పనిచేశారు. ప్రొడక్షన్ నంబర్ 1 గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రం పైకి ఓ లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్గా కనిపించినప్పటికీ.. ఇందులో బలమైన కాన్సెప్ట్ ఉందని వెల్లడించారు. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే స్టోరీలో వినోదంతో పాటు సరికొత్త అంశాలను ఆవిష్కరించబోతున్నట్లు వివరించారు.
రొమాన్స్ నుంచి సైన్స్ ఫిక్షన్ వైపు మలుపులు
సినిమా ప్రధాన నటీనటులు మాట్లాడుతూ.. సాధారణ కథాంశాలకు భిన్నంగా పక్కా స్క్రిప్టుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రారంభంలో రొమాంటిక్, లవ్ ఎలిమెంట్స్‌తో మొదలై, క్రమంగా ఊహించని సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్ వైపు కథ మలుపు తిరగడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. త్వరలోనే సినిమా టైటిల్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు.
వచ్చే ఏడాదే థియేటర్లలో సందడి
డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ తొలి చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నూతన డైరెక్టర్, యువ నటీనటులు, ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, సైన్స్ ఫిక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.














Click it and Unblock the Notifications
