Erica Fernandes:శారీరకంగా వేధించాడు.. బ్రేకప్‌పై మౌనం వీడిన ముద్దుగుమ్మ!
Erica Fernandes: ప్రముఖ నటి ఎరికా ఫెర్నాండెజ్ తన నటనతో సినీ ఇండస్ట్రీతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. 'కసౌతి జిందగీ కి 2'లో ఎరికా ఫెర్నాండెజ్ ప్రేరణ పాత్రను పోషించింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఎరికా ఫెర్నాండజ్ సినీ ఇండస్ట్రీకీ దూరంగా ఉంది. ఆమె దుబాయ్ లో స్థిరపడి చాలా ఏళ్లు అయింది. తమిళంతో పాటు కన్నడ, హిందీ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అందాల భామ.. ఆది సాయి కుమార్ నటించిన 'గాలిపటం'చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఆమె మళ్లీ ఎప్పుడు తెరపైకి వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఎరికా ఫెర్నాండెజ్ శార్దుల్ పండిట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్ షిప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె తన భాగస్వామి నుంచి శారీరకంగా వేధింపులను ఎదుర్కొన్నానని వెల్లడించింది. ఆ రోజులను తాను ఇంకా మర్చిపోలేదని ఎరికా ఫెర్నాండెజ్ చెప్పింది.

ఎరికా ఫెర్నాండెజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.."నేను చాలా వైలెంట్ రిలేషన్ షిప్ అనుభవించాను. శారీరకంగా ఎన్నో వేధింపులను కూడా ఎదుర్కొన్నాను. కానీ ఆ సమయంలో ఈ విషయం గురించి బయటికి చెప్పాలి అనుకోలేదు. ఎందుకంటే నటిగా ఉన్నప్పుడు ప్రతీదీ వార్తగా మారుతుంది. పోలీసుల వద్దకు వెళ్తే.. అది మీడియా అంతటా వ్యాపిస్తుంది. ఆపై మీడియా పదునైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను పోలీసుల వద్దకు వెళ్తే ఫలితం ఎలా ఉంటుదో నాకు తెలియదు. న్యాయవ్యవస్థపై నాకు అంత నమ్మకం లేదు. నేను అనుభవించిన గాయం నేటికీ నా హృదయంలో మాయని మచ్చలను మిగిల్చింది. నేనే కాదు.. చాలా మంది మహిళలు అందుకే బయటకు మాట్లాడరు. సినిమాలో ఒక పురుషుడు స్త్రీని హింసిస్తున్న సీన్లు వచ్చినప్పుడల్లా నాకు ఆ విషయాలే గుర్తుకు వస్తాయి. నేను 'దో పట్టి' చూసినప్పుడు, నాకు మళ్ళీ ఆ పాత రోజులు గుర్తుకు వచ్చాయి. నేను దీని గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి." అని ఎరికా ఫెర్నాండెజ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Erica Fernandes Uncensored with Shardul on her Violent Relationship out at 6 Pm on YouTube Shaardulogy #ericafernandes #shardulpandit #shaardulogy #podcast pic.twitter.com/MQg8gu3W7i
— Shardul Pandit (@shardulpandit11) March 14, 2025












Click it and Unblock the Notifications