ఆ పార్ట్ చూపిస్తే తప్పా..? అలా అంటగడతారా..! తెలుగు స్టార్ హీరో కూతురు ఆవేదన

హీరోయిన్ అంటేనే అందం.. అందం అంటే హీరోయిన్. ఇది ఈనాటిది కాదు. సినిమా వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి వస్తోన్న సంప్రదాయమే. వెండితెరపై నాయికల అందాల ఆరాధన, అభిమానుల హృదయాలను కొల్లగొట్టే గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. లేటెస్ట్ ట్రెండ్స్, ఫ్యాషన్ మరియు ఫిట్‌నెస్‌తో తారల మెరుపులు సినిమాకు కొత్త కళ తెస్తున్నాయి. తెరపై వారి హొయలు, స్టైలిష్ లుక్స్ ప్రేక్షకులకు కనువిందు చేస్తూ, ప్రతి ఫ్రేమ్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

తెర మీద హీరోయిన్ అందంగా కనిపిస్తే చాలు అభిమానులు ఆనందపడిపోతారు. అయితే ఓ హీరోయిన్ తాజాగా తన ఆవేదనను బయటపెట్టారు. కేవలం తన బాడీలో ఓ పార్ట్ చూపించినంత మాత్రాన తప్పుగా అర్ధం చేసుకుంటారా అంటూ బాధపడ్డారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. మంచు లక్ష్మీ. మంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటరామె.

even if you show your belly you will be criticized - Telugu star hero s daughter laments

సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మంచు లక్ష్మి తర్వాతే ఎవరైనా. దీనిపై ఆమె చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన పంథాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇక మాట్లాడే తెలుగుకు సపరేటు ఫ్యాన్స్ ఉన్నారు.

మంచు లక్ష్మి ప్రసన్న అచ్చమైన తెలుగమ్మాయే అయినా, ఆమె మాట్లాడే భాష, యాస ఎప్పుడూ చర్చనీయాంశమే. అమెరికాలో చదువుకుని, అక్కడి యాసకు అలవాటు పడిన లక్ష్మి, తిరిగి వచ్చాక కూడా అదే శైలిని కొనసాగించడంతో ఆమెపై సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. అయితే, లక్ష్మి ఈ విషయాలను సరదాగానే తీసుకుంటారు. తనపై తాను కౌంటర్లు వేసుకోవడానికి కూడా వెనుకాడరు.

మంచు లక్ష్మి 'ది మేల్ ఫెమినిస్ట్' పోడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ లోపాలను బయటపెట్టాయి. తాను 'స్టార్ కిడ్' అయినా వేధింపుల సంఘటనలు చూసి రాత్రిళ్లు ఏడ్చేదాన్నని చెప్పడం అందరినీ కదిలించింది.

దక్షిణాదిన బొడ్డు కనిపించినా విమర్శిస్తారు, మహిళల శరీరాన్ని తప్పుగా చూస్తారు. ఉత్తరాదిన ప్రొఫెషనలిజం ఎక్కువ అంటూ ఆమె ప్రాంతీయ వైఖరిపై మాట్లాడారు. హాలీవుడ్‌లో ఉండే సమానత్వం, ప్రైవసీని టాలీవుడ్ నేర్చుకోవాలని సూచించారు. కాస్మెటిక్ సర్జరీపై మహిళలకు పూర్తి హక్కు ఉందని, సమాజం మహిళలను మాట్లాడకుండా భయపెడుతోందని ఆమె ధైర్యంగా విమర్శించారు. ఆమె అన్‌ఫిల్టర్డ్ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+