ర్యాంప్ వా‌క్‌తో ర్యాంప్ ఆడిస్తున్న మాజీ మంత్రి రోజా కుమార్తె..

చిత్రపరిశ్రమలోకి సీనియర్ నటీనటుల వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. అయితే వారిలో చాలా తక్కువమంది మాత్రమే వేరే రంగాల్లో కూడా అడుగుపెడతారు. ఆ విధంగా అక్కడ కూడా తమ టాలెంట్ నిరూపించుకోవాలని చూస్తుంటారు. ఎక్కువగా హీరోల కుమారులు, కుమార్తెలే ఎక్కువగా లైమ్ లైట్ లోకి వస్తుంటారు. ఇటీవల కాలంలో సీనియర్ హీరోయిన్ల కుమార్తెలు సైతం బాగానే పాపులర్ అవుతున్నారు. సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా కుమార్తె.. అన్షు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే తాజాగా ఈ అమ్మడు మొదటిసారి ర్యాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతున్నాయి.

ఇప్పటికే రచయితగా తన ప్రతిభను చాటుకున్న ఆమె ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ తళుక్కుమంది. నైజీరియాలో జరిగిన ప్రతిష్ఠాత్మక 'గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ ఫెస్టివల్'లో సందడి చేసింది.
ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. టాలీవుడ్ కు మరో హీరోయిన్ దొరికేసినట్టే అంటూ యూత్ అంతా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Ex-minister Roja s daughter ramp walk goes viral on social media

చిరంజీవి, బాలకృష్ణ సహా పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించారు రోజా. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక మారుతున్న పరిస్థితులను రీత్యా ఇటీవల కాలంలో తల్లి పత్రాలు కూడా చేశారు. ఆ తర్వాత బుల్లితెరపై కూడా చాలాకాలం పాటు ప్రేక్షకులను అలరించారు. జబర్దస్త్ షోకు చాలా కాలం జడ్జిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే తన కుమార్తె అన్షు మాలిక్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. రోజా పాల్గొన్న ఎన్నో స్పెషల్ షోలలో అన్షు కూడా గెస్ట్‌గా వచ్చి ఆడియన్స్‌కు మరింత చేరువయ్యారు.

ఇన్నాళ్లు రోజా బాటలోనే ఆమె కూడా రాణిస్తారని అంతా భావించారు. కానీ ఆమె రైటర్ గా రూట్ మార్చి అందరికీ షాక్ ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం అన్షు.. ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే నవల రాసింది. ఆ నవలతో బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియా అవార్డ్ కూడా దక్కించుకుంది. దీంతో అన్షులో టాలెంట్ గురించి అందరికీ తెలిసింది. కానీ మళ్లీ ఇప్పుడు మొదటిసారి స్టేజ్ ఎక్కి ర్యాంప్ వాక్ చేయడంతో.. యూత్ అంతా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+