వరద బాధితులకు అండగా నిలిచిన ప్రముఖ నటుడు సోనూసూద్..
గత కొన్నిరోజులుగా రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీ వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా ఇప్పటికే తెలుగురాష్ట్రాలకు భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు. ఇప్పటికే వరద భాధితుల కోసం సెలబ్రిటీలు మేము సైతం అంటూ విరాళాలు అందజేస్తున్నారు. వారికి తోచిన సాయం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పడు తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్ కూడా రెండు రాష్ట్రాల వరద భాదితులకు తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వరదల్లో చిక్కుకుని నిత్యావసరాలు అందక చింతిస్తున్నవారికోసం ముందడుగ వేశారు. వారికి మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు తాత్కాలిక షెడ్స్ కూడా ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ మేరకు నటుడు సోనూసూద్ సోషల్‌మీడియాలో తన ఖాతాలో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి విపత్కర సమయంలో వారికి అండగా నిలుస్తామని సోనూసూద్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజలు తమ తమ సహాయ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్‌కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్‌ను కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ ఇచ్చారు. దీని ద్వారా ఆయన తన వంతుగా సహాయం చేయడంతో పాటు తన చారిటీ ద్వారా వనరులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ, వరద బాధితులను ఆదుకుంటున్నారు.













Click it and Unblock the Notifications